Site icon NTV Telugu

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ‘‘చారిత్రక తప్పిదం’’ వల్లే పాకిస్తాన్ అణ్వాయుధ దేశంగా మారింది..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: పాకిస్తాన్‌ని అణ్వాయుధ దేశం మారేందుకు కాంగ్రెస్ చేసిన ‘‘చారిత్రక తప్పిందాలు’’ కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. పాకిస్తాన్ తాను చేస్తున్న ఉగ్రవాదానికి, పరోక్ష యుద్ధానికి ‘‘అణు బ్లాక్‌మెయిల్’’ని వాడుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం, చాలా దేశాలు అణు బెదిరింపులను తటస్థీకరించేందుకు నిర్ణయాత్మంగా వ్యవహరిస్తున్న సమయంలో, 1980లలో భారత నాయకత్వం పాకిస్తాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు షేర్ చేశారు.

పాకిస్తాన్‌లోని కహుటా అణు కేంద్రంలో యురేనియాన్ని శుద్ధి చేస్తుందని మన ‘‘ రా’’ నుంచి నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది హిమంత అన్నారు. ఇజ్రాయిల్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చిందని, రెండు దేశాలు దాడులు చేయాలని ప్లాన్ చేసి, జామ్‌నగర్ వైమానిక స్థావరాన్ని ఇందు కోసం వాడాలని భారత సైన్యం ప్లాన్ చేసిందని, వైమానిక దాడికి భారత్ సైన్యం పూర్తిగా మద్దతు ఇచ్చిందని చెప్పారు. అయితే, చివరి నిమిషంలో అంతర్జాతీయ పరిణామాలకు భయపడి ఇందిరాగాంధీ సంకోచించారని అన్నారు. విదేశీ ఒత్తిడిలో రక్షణ కంటే దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తూ రాజీవ్ గాంధీ ఈ ప్రణాళికను పక్కనపెట్టారని అన్నారు.

Read Also: Israel-Iran war: ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్.. ఇరాన్ ఘర్షణతో భయం..

1988లో రాజీవ్ గాంధీ బెనజీర్ భుట్టోతో ఒక నాన్-స్ట్రైక్ అణు ఒప్పందంపై సంతకం చేశారు, ఒకరి అణు స్థావరాలపై మరొకరు దాడి చేయకుండా పరస్పర సంయమనం పాటించాలని కోరారని, అయితే, ఒక దశాబ్దం తర్వాత 1998లో పాకిస్తాన్ అణ్వాయుధాలను పరీక్షించిందని ఎక్స్‌లో రాసుకొచ్చారు. భారత్ ఖరీదైన అణ్వాయుధ పోటీలోకి లాగబడిందని, కార్గిల్, ప్రాక్సీ యుద్ధాలకు, సరిహద్దు దాడులకు పాకిస్తాన్ అణ్వాయుధ కవచాన్ని ఉపయోగించుకుంటుందని అన్నారు. నేటికీ, పాకిస్తాన్ అంతర్జాతీయ చర్యను నిరోధించడానికి, దాని దుష్ట ప్రవర్తనను చట్టబద్ధం చేయడానికి అణు బ్లాక్‌మెయిల్‌ను ఉపయోగిస్తోందని విమర్శించారు.

బలమైన నాయకత్వం, దృ‌ఢ సంకల్పం, దూరదృష్టి కోరుకునే సమయంలో, కాంగ్రెస్ తన అజాగ్రత్త, ఆలస్యాన్ని అందించిందని విమర్శించారు. భారతదేశ దీర్ఘకాలిక భద్రతను కాపాడుకోవడానికి వచ్చిన అవకాశాలను వృధా చేశారని మండిపడ్డారు. దీనికి ఇప్పటికీ భారత్ మూల్యం చెల్లిస్తూనే వస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే, 2024 ఎన్నికల్లో సీపీఎం మానిఫెస్టోని కూడా హిమంత విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే అణ్వాయుధాలను వెనక్కి తీసుకుంటామని తన మానిఫెస్టోలో ప్రకటించింది.

Exit mobile version