దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపాల వద్ద వారం పాటు మహిళలు దాండియా, బతుకమ్మ ఆడుతారు. అయితే, నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న దుర్గామాత చివరి రోజు ఊరేగింపు చేసి నిమజ్జనం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఓ ఉన్నతాధికారి అమ్మవారి గుడిలోకి బూట్లతో వచ్చి అపవిత్రం చేశాడు. దీంతో భక్తులు అతడిపై దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read:Yerragadda: కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలి: మంత్రి పొన్నం
పండుగ స్థానిక సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయింది. కఠినమైన ఆచారాలు, ప్రోటోకాల్‌లను పాటిస్తారు, ముఖ్యంగా దేవతలు, వారి ఊరేగింపులకు సంబంధించి. పవిత్ర స్థలాలలోకి ప్రవేశించే ముందు పాదరక్షలను తొలగిస్తారు.
Also Read:Viral Video: ఇదేందయ్యా ఇది… పోలీసులు ఇలా కూడా చేస్తారా..
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో హరిసింగ్ యాదవ్ అనే తహసీల్దార్ షూ వేసుకుని అమ్మవారి గుడిలోకి ప్రవేశించాడు. దీంతో అమ్మవారి పవిత్రతకు భంగం కలిగించాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిపై దాడి చేసి.. బట్టలు చింపేశారు. అనంతరం గుడి చూట్లూ ఊరేగించి.. దేవత ముందు అతడితో క్షమాపణ చెప్పించారు. ఈ ఘటనను భక్తులు షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కులు జిల్లా యంత్రాంగం తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…
The person being dragged here is Tehsildar Kullu, who after a scuffle with Devta’s devotee yesterday was made to apologise. We don’t favour violence, but why are such incompetent officials put on ground? What was the administration doing ,what if this had turned violent? pic.twitter.com/NOw8Sn7gwP
— Nikhil saini (@iNikhilsaini) October 2, 2025