Congress: కుల గణనను ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ ఉపకరణంగా వినియోగించరాదని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. ఇప్పుడు కులగణనకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర ప్రజలకు ఇచ్చిన మరో హామీని దోచుకొని, కులగణనను నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. కుల గణనకు పర్మిషల్ ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్ ఎవరు..? ఎన్నికల ప్రచారానికి కుల గణనను దుర్వినియోగం చేయరాదని చెప్పడం వెనక అర్థం ఏమిటి? ఆ సంస్థ ఏమైనా న్యాయమూర్తి స్థానంలో ఉందా? అని క్వశ్చన్ చేశారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశంపై ఆర్ఎస్ఎస్ ఇంతకాలంగా ఎందుకు సైలెంట్ గా ఉంటుందని జైం రమేష్ దుయ్యబట్టారు.
Read Also: Post Card: కాస్త ఆలస్యమైన.. 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరిన ఉత్తరం..
ఇతంకీ, సంఘ్ పరివార్ దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులు, పేద- బడుగు బలహీన వర్గాల భాగస్వామ్యం, అభివృద్ధి గురించి ఆలోచిస్తుందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత జైం రమేష్ అన్నారు. దేశ రాజ్యాంగానికి బదులు మనుస్మృతిని తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడ్రోజుల పాటు కేరళలోని పాలక్కడ్‌లో నిర్వహించిన నేషనల్ లెవల్ సమన్వయ మీటింగ్ లో భాగంగా సోమవారం ఆ సంస్థ జాతీయ ప్రతినిధి సునీల్ అంబేకర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు సమాచార అవసరాల కోసం కులగణనను చేపట్టవచ్చు అని తెలిపారు. మన సమాజంలో కులాల ప్రతిస్పందనలు చాలా సున్నితమైన అంశాలు అని పేర్కొన్నారు. కులగణన సమాచారాన్ని ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించకూడదు అని తెలిపారు.