Site icon NTV Telugu

Delhi High Alert: ఢిల్లీలో హై అలర్ట్.. 14మంది అరెస్ట్

Delhi Police

Delhi Police

దేశరాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీ జహంగీర్ పురలో 144 సెక్షన్ అమలులో వుంది. భారీగా రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. నిన్న హనుమాన్ శోభయాత్రలో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి ఘటనలో గాయపడ్డ 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. రాళ్ళు రువ్విన ఘటనలో పోలీసులతో పాటు పౌరులు కూడా గాయాలపాలయ్యారు.

పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసు అధికారులతో మాట్లాడిన కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా. సీఎం అరవింద్ కేజ్రివాల్ పరిస్థితిని ఆరా తీశారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మసీద్ వద్దకు చేరుకోగానే మొదలైన చిన్న గొదవ తరువాత పెద్దగా మారింది. ఇరువర్గాలు రాళ్ళు రువ్వుకున్నాయి. ప్రజలంతా సమన్యయం పాటించాలని,దుష్ప్రచారాలను, వదంతులను నమ్మొద్దని పోలీసులు కోరారు.

Read Also: New Delhi: 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే థియేటర్‌లో అగ్నిప్రమాదం

మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణకు అమన్​కమిటీలతో ఆదివారం పోలీసు అధికారులు భేటీ అయ్యారు. ప్రజలను శాంతియుతంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేయాలని కమిటీ సభ్యులను పోలీసులు కోరారు. కమిటీ సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉండాలని..ఏ ప్రాంతంలోనైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు అమన్​కమిటీలను కోరారు.

ఇదిలా వుంటే యూపీ, ఉత్తరాఖండ్​లో కూడా శనివారం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Exit mobile version