జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్.. హేమంత్‌తో ప్రమాణం చేయించారు. కేవలం హేమంత్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలంతా హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సతీమణి సునీతా కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, తదితర నేతలంతా హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: మైనర్ బాలికపై అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం..
రాష్ట్రంలో 81 స్థానాలుండగా.. జేఎంఎం 34 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్)(ఎల్) రెండు, ఏజేఎస్‌యూపీ, లోక్ జనశక్తిపార్టీ (రాం విలాస్), జేఎల్‌కేఎం, జేడీయూ చెరో ఒక స్థానం చొప్పున గెలుచుకున్నాయి.