Site icon NTV Telugu

Delhi Rain: ఢిల్లీలో ఈదురుగాలులతో భారీ వర్షం.. దెబ్బతిన్న అశోక్‌నగర్ మెట్రో స్టేషన్

Delhirain

Delhirain

దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బలమైన గాలుల కారణంగా అశోక్‌నగర్ మెట్రో స్టేషన్ షెడ్ దెబ్బతింది. ఇక పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరుగుపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 గంటల్లో 146 మంది మృతి

ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిక జారీ చేసింది. 2 గంటల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఇలాంటి వాతావరణమే నెలకొంది. హెచ్చు తగ్గులతో వాతావరణం ఉంటుంది. కొన్ని గంటలు వేడి.. మరికొన్ని గంటలు చల్లగా ఉంటుంది. తాజాగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో ఉష్ణోగ్రత పడిపోవడంతో నగర వాసులు చల్లని గాలులతో సేదదీరుతున్నారు.

ఇది కూడా చదవండి: ISRO: ఈ శాటిలైట్‌‌ ద్వారా పాకిస్తాన్ రాత్రి ఏం చేస్తుందో కూడా చూడొచ్చు.. రేపే ప్రయోగం..

ఇటీవల కాలంలో దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించాయి. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే ప్రయాణికులు నిరీక్షించారు. మరికొన్ని విమానాలు దారి మళ్లించారు. మరొకసారి గాలి తుఫాన్ బీభత్సం సృష్టించడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

 

Exit mobile version