NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. మెరుపులు.. గాలులతో వర్షం

Delhirain

Delhirain

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా మెరుపులు, గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వాహనదారులైతే నానా తంటాలు పడ్డారు. పలుచోట్ల వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడ్డారు. చైనాలో ఇటీవల వచ్చిన యాగీ తుఫాన్ ఎఫెక్ట్ కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Coconut: పచ్చికొబ్బరి తింటే ఎన్ని లాభాలో..!

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎండలు మండిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) ముందుగానే సెప్టెంబర్ 17న ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం ఎండ.. కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజ‌ర్వేష‌న్‌పై రేపు చ‌ర్చలు

Show comments