Site icon NTV Telugu

భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలం..

channai

channai

చెన్నైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల రోజుగా విడవకుండా కురుస్తున్న జోరు వర్షంతో చెన్నై మహానగరం వణుకుతోంది. గంటల తరబడి కురుస్తున్న వానలు తమిళుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలోని మూడు సబ్ వేల నుంచి రాకపోకల్ని అధికారులు నిలిపి వేశారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు మోకాలు లోతు వాన నీరు రోడ్డు మీద నిలిచిపోయింది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో తరచూ కురుస్తున్న భారీ వర్షం కారణంగా చెన్నై మహానగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున అవస్థలు పడుతున్నారు. ఇక వారి అవస్థను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు.

Exit mobile version