Bangalore Rain: తడిసి ముద్దయిన బెంగళూరు..ఒక్కరోజే 10 సెంటీమీటర్ల వాన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుతుపవనాలరాకకు ముందే కర్నాటకలో భారీవర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో ఒక్కరోజులో 10 సెంటీమీటర్లకు పైగా వానపడడంతో ముంపులోనే అనేక ప్రాంతాలు వుండిపోయాయి. రెండవ రోజూ సీఎం సందర్శన కొనసాగుతోంది. బెంగళూరులో మంగళవారం ఈ శతాబ్దంలోనే కురిసిన భారీ వర్షంగా చరిత్రకెక్కింది. గత 113 ఏళ్లలో మే నెలలో ఒకేరోజు కురిసిన అత్యధిక వాన ఇదే. అంతేకాదు ఇది బెంగళూరు నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం. 1909 మే 6వ తేదీన 15.39 సెంటీమీటర్ల కుండపోత అతలాకుతలం చేసింది.
మంగళవారం 11.46 సెంటీమీటర్లు వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా మే నెలలో బెంగళూరులో సగటు వర్షపాతం 10.74 సెంటీమీటర్లు కాగా, మంగళవారం రాత్రి ఒక్కరోజులోనే ఆ వర్షం కురవడంతో నగరం తడిసి ముద్దయింది. బెంగళూరులోని హొరమావు ప్రాంతం ఇంకా ముంపులోనే వుంది. ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే వుండిపోయాయి. ప్రజలు రోడ్ల మీదకు రావడానికి మార్గం లేదు. ఇళ్లు, అపార్టుమెంట్ల చుట్టూ వాననీరు, బురద మేటవేసింది. ఇలాగే కొనసాగితే ప్రమాదకర అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.1600 కోట్లతో బెంగళూరులోని కాలువలను అభివృద్ధి చేస్తామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. వర్ష బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. డ్రైనేజీలు, భూగర్భ డ్రైనేజీలను మరమ్మతు చేసి వాననీరు సజావుగా వెళ్లేలా చేస్తామన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇళ్లలోకి నీరుచేరి గృహోపకరణాలు పాడయ్యాయి. వర్షాల వల్ల నష్టపోయిన వారికి రూ.25 వేలు పరిహారం అందిస్తాం, ఒకవారం పాటు ఆహారం అందిస్తామని సీఎం తెలిపారు.జేపీ నగర లేఔట్‌లో పలువురు మహిళల వర్ష కష్టాలపై సీఎంకు వినతులు అందచేశారు. అక్కడ నుంచి కమలానగర మెయిన్‌రోడ్డు, శంకరమఠ దేవస్దాన, హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్ తదితర ప్రాంతాల్లో బస్సులో పర్యటించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తాగునీరు, విద్యుత్ లేవు, తినడానికి తిండి లేదు. అధికారులెవరూ తమను పట్టించుకోవడం లేదని సీఎంకి వివరించారు బాధిత మహిళలు.
Virat Kohli: అరుదైన రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..