Maharastra: అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించే సాంకేతికత అభివృద్ధి చెందినా.. ఇంకా దేశంలోని కొన్ని గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించబడలేదు. అటువంటి వాటిలో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అంబులెన్స్ ల ఏర్పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో చేయలేదు. ఇలా ఆసుపత్రి వద్ద అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ఈ హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో వేరే గత్యంతరం లేక మృతదేహాన్ని బైక్‌పై తమ గ్రామానికి తీసుకెళ్లారు. ఈ వృదయ విదాకరమైన ఘటన మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని భామ్రాగఢ్‌లో చోటు చేసుకుంది.
Read also: Income Tax Notice: లక్ష మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.. కారణం ఇదే
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. గడ్చిరోలి జిల్లాలోని భామ్రాగఢ్‌లో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో యువకుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంలో కట్టి స్వగ్రామానికి తరలించాల్సి వచ్చింది. గణేష్ తెల్మి అనే యువకుడు క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం అతనికి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి గ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ఎంతగానో వెతికినా అంబులెన్స్ అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఇక చేసేదేమి లేక మృతి చెందిన యువకుడి కుటుంబానికి చెందిన యువకుడు ఒక బైక్‌పై మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. మరణించిన యువకుడి మృతదేహాన్ని ఒక మంచపై కట్టి.. ఆ మంచాన్ని పడిపోకుండా ఉండేలాగా తన బైక్‌కు వెనకాల కట్టాడు. అలా మృతదేహం ఉన్న మంచాన్ని బైక్‌కు కట్టుకని తమ స్వగ్రామానికి తరలించారు. ఎంతో టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో ఇప్పటికీ కూడా ఆసుప్రతుల దగ్గర అంబులెన్స్ లు అందుబాటులో లేకుండా పోవడం అత్యంత దారుణం. ప్రభుత్వ ఆసుప్రతుల్లో చికిత్స పొందుతూ మరణించే పేద, నిరుపేదలను మృతదేహాలను తమ స్వగ్రామాలకు తరలించడం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పార్థీవ దేహాన్ని తరలించడం కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన పేదల మృతదేహాల తరలింపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పార్థీవ దేహాల తరలింపు అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటి పథకం అమలు జరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటివి అమలు జరిగితే బాగుంటుందని పేదలు కోరుకుంటున్నారు.
