Site icon NTV Telugu

PM Modi: చిన్నారి చేతిలో అమ్మ ఫోటో చూసి మోడీ భావోద్వేగం.. వీడియో వైరల్..

Pm Modi

Pm Modi

PM Modi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌లో పర్యటించారు. ర్యాలీలో ఓ చిన్నారి నరేంద్రమోడీ తల్లి చిత్రాన్ని ప్రదర్శించింది. దీనిని చూసిన ప్రధాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాగల్‌కోట్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా, ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ మోదీతో కలిసి ఉన్న స్కెచ్‌తో ఒక యువతి కనిపించింది. ఆ స్కెచ్‌ని తమకు ఇవ్వాలని ఆమ్మాయిని కోరారు.

Read Also: India-Canada Row: ఖలిస్తాన్ నినాదాలు.. కెనడా రాయబారికి భారత్ సమన్లు..

బాలిక వైపు చూసి థంప్సప్ సిగ్నల్ చూపించారు. అమ్మాయి కళకు ప్రధాని మోడీ సంతోషంగా వ్యక్తం చేశారు. బాలికను గమనించిన ప్రధాని తన భద్రత సిబ్బందికి చెప్పి చిన్నారి నుంచి ఫోటో తీసుకురావాలని కోరారు. ‘‘ ఈ అమ్మాయి చాలా సేపు ఫోటోతో నిలబడి ఉంది. దయచేసి ఆమె నుంచి ఫోటో తీసుకోంది’’ అని చెప్పారు. ప్రధాని మోడీ అమ్మాయి పేరు, చిరునామాను అడిగారు. అమ్మాయి, పేరు చిరునామాను ఫోటోపై రాయమని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. ప్రధాని మోడీ మాటలకు బాలిక ఆనందానికి గురవ్వడం వీడియో చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ 99 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 2022 లో గుజరాత్ ఆసుపత్రిలో మరణించారు.

Exit mobile version