Indian Coast Guard: నడి సముద్రంలో హర్ట్ స్ట్రోక్.. రెస్క్యూ ఆపరేషన్‌తో రోగికి చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Coast Guard: ఓడలో ప్రయాణిస్తున్న వ్యక్తికి నడి సముద్రంలో హర్ట్ స్ట్రోక్ వచ్చింది. పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎలా కాపాడాలా? కోస్డ్ గార్డ్స్ కి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ ఆపరేషన్ చేసి.. అతన్ని హెలికాప్టర్లోకి తీసుకుని ప్రథమ చికిత్సను అందించి.. అనంతరం ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను చేసి ప్రాణాలు కాపాడారు. అరేబియా సముద్రంలో చైనీయుడికి తీవ్ర గుండెనొప్పి వచ్చింది. సమాచారమందుకున్న భారత కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి అతడిని రక్షించింది.
Read also: Swathistha: రజినీ కోడలు కత్తి అనుకుంటే… కమల్ కోడలు అమ్మోరు కత్తిలా ఉందే…
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
పనామా పతాకంతో ఉన్న ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 రీసర్చ్ నౌక చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఈఏ వెళుతుంది. బుధవారం రాత్రి ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బంది యిన్ వీగ్యాంగ్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. తీవ్రమైన ఛాతినొప్పితో విలవిల్లాడిపోయాడు. సమస్య తీవ్రతను గమనించిన నౌక సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు అత్యవసర సందేశం పంపించారు. దాంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది బాధితుడిని అత్యవసరంగా ఆసుపత్రికి చేర్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఏఎల్‌హెచ్ ఎంకే-3 హెలికాప్టర్‌తో కోస్ట్‌గార్డ్ బయల్దేరారు. వారు వచ్చిన అర్థరాత్రి సమయంలో చైనా నౌక అరేబియా సముద్రంలో తీరానికి దాదాపు 200 కి.మీల దూరంలో ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ కోస్ట్‌గార్డ్ చిమ్మచీకట్లో ధైర్యంగా నౌకలో నుంచి వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి హెలికాప్టర్లోకి తీసుకుంది. ఎయిర్‌లిఫ్ట్ లోకి తీసుకోగానే వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం సమీప ఆసుపత్రికి తరలించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైన సందర్భంలో కూడా కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేసి సిబ్బంది ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మరోసారి అటువంటి ఆపరేషన్ చేసి చైనా వ్యక్తి ప్రాణాలు కాపాడారు.
In a daring operation, @IndiaCoastGuard #ALH MK-III evacuates a #Chinese national from MV Dong Fang Kan Tan No 2 around 200 Km mid-sea amidst challenging night conditions & extreme weather. Patient was reported chest pain &cardiac arrest symptoms.#SAR #ArabianSea#MaritimeSafety pic.twitter.com/THG0nBZjhi
— Indian Coast Guard (@IndiaCoastGuard) August 17, 2023
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!