NTV Telugu Site icon

Congress: ‘సంవిధాన్ హత్యా దివాస్’పై కాంగ్రెస్.. 10 ఏళ్ల నుంచి బీజేపీ అదే చేస్తుందని ధ్వజం..

Pm Modi

Pm Modi

Congress: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అయితే, ఈ రోజును ప్రతీ ఏడాది ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలని ఈ రోజు కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతోంది. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ దీనిని ప్రకటించిందంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని మోడీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ‘‘నాన్-బయోలాజికల్ పీఎం ద్వారా హెడ్‌లైన్స్ కోసం చేయబడిని పని’’ అని అన్నారు.

Read Also: Uttar Pradesh: యువకుడితో ఇద్దరు పిల్లల తల్లి రొమాన్స్.. గదిలో పట్టుకున్న భర్త

కేంద్రం నిర్ణయాన్ని జైరాం రమేష్‌ తప్పుపట్టారు. గత పదేళ్లుగా భారతీయులపై అప్రకటిత ఎమర్జెన్సీని ప్రధాని నరేంద్రమోడీపై మండిపడ్డారు. జూన్ 4ని ‘మోడీ ముక్తి దివాస్’గా చరిత్రలో నిలిచిపోయిందని ఆయన అన్నారు. జూన్ 4, 2024న భారతదేశ ప్రజలు ప్రధాని మోడీకి నిర్ణయాత్మక వ్యక్తిగత రాజకీయ, నైతిక ఓటమిని అందించారని అన్నారు. ప్రధాని మోడీ భారత రాజ్యాంగం, దాని సూత్రాలు, విలువలపై రాజ్యాంగ సంస్థలపై క్రమబద్ధమైన దాడి చేశారని ఆరోపించారు. మనుస్మృతి నుండి ప్రేరణ పొందిన మోడీ పరివార్ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించిందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. 1949లో మనుస్మృతి నుండి ప్రేరణ పొందలేదనే కారణంతో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తిరస్కరించిందని అన్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని తీసుకురావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తద్వారా దళితులు, గిరిజనులు, వెనబడిన తరగతుల వారి హక్కులపై దాడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసమే పవిత్రమైన రాజ్యాంగానికి హత్యా అనే పదాన్ని జత చేసి అంబేద్కర్‌ని అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.