NTV Telugu Site icon

CM Nitish Kumar: జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Nitish Kumar

Nitish Kumar

CM Nitish Kumar: కులగణన, రిజర్వేషన్ల అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చర్చ సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘జనాభా నియంత్రణ’పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం నితీష్ కుమార్‌కి మద్దతు తెలుపుతున్నాయి.

జనాభా నియంత్రణపై మాట్లాడుతూ.. గతంలో 4.3 శాతం సంతానోత్పత్రి రేటు ఇప్పుడు 2.9 శాతానికి పడిపోయిందని ముఖ్యమంత్రి చెబుతూ.. ‘‘సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఈ తరం అమ్మాయిలకు బాగా అవగాహన పెరిగింది. ‘ఏ టైంలో ఏం చేయాలో వారి బాగా తెలుసు’. అందుకే జనాభా తగ్గుతోంది’’ అని సీఎం చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఒకింత షాక్‌కి గురయ్యారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు వింతగా ఉన్నాయంటూ మహిళా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Putin: 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్..

బీజేపీ ఈ వ్యాఖ్యల్ని అసభ్యకరమైనవిగా పేర్కొంది. ‘‘భారత రాజకీయాల్లో నితీష్ కుమార్ కన్నా అసభ్యకరమైన నాయకుడు లేడు. నితీష్ కుమార్ అడల్ట్, బీ-గ్రేడ్ చిత్రాల కీటకాలు కాటు వేసినట్లు కనిపిస్తోంది. అతను డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై నిషేధం ఉండాలి.’’ అని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో విమర్శించింది. ముఖ్యమంత్రికి 70 ఏళ్లు దాటినా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, మేం చెప్పలేని పదాల్ని ఉపయోగించారని, దీనిపై నిరసన తెలియజేస్తామని బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి దేవీ అన్నారు.

జనాభా నియంత్రణ ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతూ, ముఖ్యమంత్రి కొన్ని పదాలను తప్పుగా చెప్పారని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే అంగీకరించారు. మన సమాజం కొన్ని విషయాలను బహిరంగంగా చెప్పడం నిషేధిస్తుందని ఎమ్మెల్యే ప్రతిమాదాస్ అన్నారు. సెక్స్ ఎడ్యుకేషణ్ గురించి మాట్లాడటంపై డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సీఎంకి మద్దతు తెలిపారు.

సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అతిన ప్రసంగంలో వాడిన అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి మాయని మచ్చ అని, ఇంత బహిరంగంగా ఓ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే, రాష్ట్రం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు.