Site icon NTV Telugu

Mamata Banerjee: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వారిపై వేధింపులు.. మమతా బెనర్జీ ఆగ్రహం!

Mamatha

Mamatha

Mamata Banerjee: 2026 ఎన్నికలలో దూకుడు మీదున్న బీజేపీని ఎదుర్కోవడానికి బెంగాలీల ఆత్మగౌరవం అనే భావోద్వేగ అంశాన్ని టీఎంసీ మళ్లీ రగిలించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు బెంగాల్ కి చెందిన పౌరులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని టీఎంసీ ఆరోపించింది. ఇందులో భాగంగానే, కమలం పార్టీకి వ్యతిరేకంగా వర్షం కురిసినప్పటికీ కోల్‌కతా నడిబొడ్డున సుమారు 3 కిలోమీటర్ల పొడవునా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీతో సహా అధికార తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అలాగే, బెంగాలీ ప్రజల పట్ల ఆ ( బీజేపీ పాలిత) రాష్ట్రాలు చేస్తున్న దౌర్జన్యాలపై సిగ్గుపడాలి అని మండిపడింది.

Read Also: US: సోర్ట్‌లో ఖరీదైన వస్తువులు దొంగతనం.. భారతీయ మహిళ అరెస్ట్

అయితే, ఒడిశాలోని ఝార్సుగూడలో 444 మంది అనుమానిత బంగ్లాదేశ్ జాతీయులను ఇటీవల అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర నిరసనకు దారి తీసింది. వారిలో 200 మంది బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. అలాగే, ఢిల్లీలో కూడా బెంగాల్ వాసుల బహిష్కరణ డ్రైవ్‌లు కొనసాగుతున్నట్లు పలు నివేదికలు బయటకు వస్తున్నాయని బీజేపీపై టీఎంసీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కాగా, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పశ్చిమ బెంగాల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. దీంతో బీజేపీ ఆధ్వర్యంలోని పలు రాష్ట్రాల్లో బెంగాల్ పౌరులపై వేధింపుల అంశాన్ని తెర పైకి తీసుకొచ్చింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ.

Exit mobile version