Site icon NTV Telugu

Haiti: ఎవరీ జిమ్మి చెరిజియర్.. గ్యాంగ్‌స్టర్‌కి వణుకుతున్న హైతీ దేశం..

Haiti

Haiti

Haiti: కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేదదేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచిఉంది. జిమ్మి చెరిజియర్, ‘‘బార్బెక్యూ’’గా పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్, ఇటీవల 3700 మంది ఖైదీలను విడిపించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది. ఆ దేశ అధినేత కెన్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో హైతీ దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

Read Also: Chiranjeevi: ముకేశ్ అంబానీ ఇప్పుడు చేశాడు.. కానీ, చిరు ఎప్పుడో చేశాడు.. అది మెగాస్టార్ అంటే..

మాజీ పోలీస్ అధికారి నుంచి గ్యాంగ్ స్టర్‌గా మారిన జిమ్మీ చెరిజియన్ చాలా కాలంగా ఆ దేశంలో భయంకరమైన హింసకు పాల్పడుతున్నాడని అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ప్రత్యర్థులను క్రూరంగా సజీవ దహనం చేసి చంపడం వంటి చేస్తుంటాడు. G9 ఫ్యామిలీ అండ్ మిల్లీస్ అనే శక్తివంతమైన ముఠా కూటమికి నాయకత్వం వహిస్తున్న చెరిజియర్, 2018లో లా సెలైన్‌లో జరిగి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో ఏకంగా 70 మందికి పైగా మరణించారు. మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తాను పేదల రక్షకుడిగా చెప్పుకోవడంతో ప్రజల మద్దతు పొందుతున్నారు.

పోలీస్ ఫోర్స్ నుంచి తొలగించబడిన తర్వాత, చెరిజియన్ G9ని స్థాపించాడు. ఇటీవల కాలంలో ఈ సంస్థ పౌర హత్యలకు పాల్పడుతోంది. చెరిజియర్, మాజీ ప్రెసిడెంట్ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. 2021లో హైతీలో అధ్యక్షుడి హత్య జరిగింది. అప్పటి నుంచి ఆ దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. G9తో సహా ముఠాలు ఇప్పుడు దేశ రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌లో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తున్నాయి. కిడ్నాప్, హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఆహార కొరత, వ్యాధుల వ్యాప్తి, ఇంధన సంక్షోభం వల్ల ఈ హింస తీవ్రమైంది. కరుడుగట్టిన ఖైదీలు జైలు నుంచి బయటకు రావడంత సంక్షోభంలో ఉన్న హైతీని మరింత ప్రమాదంలోకి నెడుతుందని అధికారులు భయపడుతున్నారు. యూఎన్, ఎఎస్ ఆంక్షల్లో ఉన్న ఐదుగురు ముఠా నాయకుల్లో చెరిజియర్ ఒకరు.

Exit mobile version