LeT leader: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, పాక్ సైన్యంపై విరుచుకుపడింది. పీఓకే, పాకిస్తాన్‌లోని ఇతర భాగాల్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, భారత్ తమ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని లష్కరేతోయిబా(ఎల్‌ఇటి) అగ్ర నాయకుడు అంగీకరించాడు. అయినప్పటికీ, భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డాడు.
Read Also: Moon Events 2026 : ఖగోళ ప్రేమికులకు పండగే.. 2026లో 13 ఆకాశ అద్భుతాలు.!
లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సహాయకుడు, ఆ సంస్థ డిప్యూటీ చీప్, పహల్గామ్ దాడి సూత్రధారి అయిన సైఫుల్లా కసూరి భారత దాడులను ఒప్పుకున్నారు. పాక్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో కసూరీ ఈ వ్యాఖ్యలు చేశాడు. విద్వేషపూరిత ప్రసంగంలో.. ‘‘మేము మా కాశ్మీర్ మిషన్ నుంచి ఎప్పటికీ వెనక్కి తగ్గము’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్, అమృత్సర్, హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, జునాగఢ్, మునావదర్‌లోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ దక్కన్, బెంగాల్ వంటి పాకిస్తాన్ ప్రాంతాలను తీసుకున్నారని అన్నాడు.
