Rahul Gandhi: వారణాసి నుంచి ప్రియాంకా పోటీ చేసి ఉంటే, మోడీ ఓడిపోయేవారు..
- రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
- వారణాసి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేసుంటే..
- రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- అమేథీ-రాయ్‌బరేలీల్లో హస్తం పార్టీ బంపర్ విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తన సోదరి ప్రియాంకాగాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్రమోడీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించేవారని మంగళవారం రాహుల్ గాంధీ అన్నారు. వారణాసి నుంచి 2014 నుంచి మోడీ పోటీ చేస్తున్నారు, 2014, 2019తో పోలిస్తే 2024లో గెలుపు మార్జిన్ తక్కువగా ఉంది. ఇటీవల రాయ్‌బరేలీ నుంచి మూడు లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ, ఈ రోజు అక్కడి నుంచి మాట్లాడుతూ మోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Yuva Rajkumar: భార్యకు అక్రమ సంబంధం.. రాజ్ కుమార్ ఫ్యామిలీ హీరో సంచలనం!
Also Read
- Floods: మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
తాను అహంకారంతో ఈ మాట చెప్పడం లేదని, మోడీ రాజకీయాలు తమకు నచ్చడం లేదని భారత ప్రజలు ఆయనకు సందేశం పంపారని, అందుకు తాను ఈ మాట చెబుతున్నట్లు వెల్లడించారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాము నిలబడుతామనే సందేశాన్ని ప్రజలు పంపారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నప్పటికీ, ఆమె పోటీ నుంచి దూరంగా ఉన్నారు.
మరోవైపు రాహుల్ గాంధీ వయనాడ్, తన తల్లి సోనియా గాంధీ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ ఆధిక్యతతో గెలిచారు. అమేథీ నుంచి కేఎల్ శర్మను కాంగ్రెస్ పోటీకి దింపింది, ఇతను బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ దెబ్బతీసింది. గత రెండుసార్లు బీజేపీకి 60+ సీట్లను ఇచ్చిన ఈ రాష్ట్రం 2024లో మాత్రం ఎన్డీయే కూటమికి 36 సీట్లే కట్టబెట్టింది.
తాజావార్తలు
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!