Khalistani Terrorist: భారత్‌లోని సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసివేయాలని అమెరికాలోని ఖలిస్థానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించాడు. ఒకప్పటి సీఆర్‌పీఎఫ్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మాజీ రా అధికారి వికాస్ యాదవ్‌లు తమ(సిక్కుల) హక్కుల హననానికి పాల్పడ్డరారని పన్నూన్ ఆరోపణలు చేశాడు. పంజాబ్, విదేశాల్లోని సిక్కులపై దాడులకు పాల్పడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్ పాఠశాలలను బహిష్కరించాలి.. స్వర్ణ దేవాలయంపై దాడి, 1984లో సిక్కుల ఊచకోతకు మనుషులను సమకూర్చడం లాంటివి సీఆర్పీఎఫ్ చేసిందని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వెల్లడించారు.
Read Also: Sathyam Sundaram : ఓటీటీలోకి వచ్చేసిన ‘సత్యం సుందరం’.. ఎక్కడ చూడాలంటే ?
ఇక, సీఆర్పీఎఫ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నాయకత్వం వహిస్తున్నారు. ఖలీస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కిరాయి హంతకులను ఆయనే నియమించారుని గురు పత్వంత్ సింగ్ పన్నూన్ ఆరోపించారు. న్యూయార్క్‌లో నన్ను హత్య చేసేందుకు కుట్ర చేశారని తెలిపారు. అమిత్‌షా విదేశీ పర్యటనల సమాచారం ముందస్తుగా ఇచ్చిన వారికి మిలియన్ డాలర్లు నజరానా ఇస్తానని వెల్లడించారు. అలాగే, ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడుకు ‘జస్టిస్ లీగ్ ఇండియా’ అనే ఖలిస్థానీ అనుకూల గ్రూపు పూర్తి బాధ్యత తీసుకుందన్నారు. ఇక, ఖలిస్థానీ వేర్పాటువాదులను మట్టుబెట్టడానికి ప్రతీకారంగా దుండగులు ఈ చర్యకు దిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.