Chhattisgarh: ఎన్నికల వేళ.. సుకుమాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రోజు మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన సుకుమా జిల్లాలోని తాడ్‌మెట్ల, దూలెడ్ గ్రామాల మధ్య పనావర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపుగా 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగాయి. ఎన్నికల నిర్వహణకు వెళ్లిన బీఎస్‌ఎఫ్ డీఆర్‌జీ బృందంపై నక్సలైట్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం భద్రతాసిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ ఘటన బండే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే 47ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడూర్ అడవుల్లో ఎస్టీఎఫ్, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. భద్రతాబలగాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, అయితే ఇద్దరు ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు, వారి మృతదేహాలను తీసుకుని అటవీ ప్రాంతాల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది.
Also Read
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
Read Also: Hydrogen Powered Car: ఇది కదా కారంటే..? రూ.150 ఖర్చు చేస్తే.. 300 కిలోమీటర్లు వెళ్లొచ్చు..
దక్షిణ బస్తర్ దంతెవాడ జిల్లాలోని మన్పా గ్రామంలో ఎన్నికలకు భద్రత కల్పించేందుకు 206 కోబ్రా బెటాలియన్‌కి చెందిన సైనికులు అటవీ ప్రాంతంలో మోహరించారు. ఈ తెల్లవారుజామున సుకుమాలోని తొండమార్క ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన పేలుడులో ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా సిబ్బంది గాయపడ్డారు.
ఛత్తీస్గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపుగా 60 వేల మంది భద్రతా సిబ్బంది మోహరించారు. 2018లో ఈ 20 సీట్లలో కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించగా..బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!