Site icon NTV Telugu

Custodial Deaths: కస్టడీ మరణాల్లో గుజరాత్‌ టాప్‌.. వివరాలు ప్రకటించిన NHRC

Custodial Deaths

Custodial Deaths

Custodial Deaths: పోలీసు కస్టడీ మరణాల్లో దేశంలో గుజరాత్‌ టాప్‌ స్థానంలో ఉంది. దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను జాతీయ మానవ హక్కుల కమిషన్‌(NHRC) ప్రకటించింది. 2018 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి వరకు 81 పోలీసు కస్టడీ మరణాలతో గుజరాత్‌.. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని జైళ్లలో మగ్గుతోన్న విచారణ ఖైదీల సంఖ్య 2021 డిసెంబరు నాటికి 4.27 లక్షలకు చేరింది.

Read also: Allu Arjun: ఇదేందయ్యా ఇది.. బన్నీకి జోడిగా AI హీరోయినా..?

పోలీసు కస్టడీ మరణాల్లో గుజరాత్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ మంగళవారం లోక్‌సభలో ఈ వివరాలు వెల్లడించారు. 2018 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి వరకు సంబంధించిన గణాంకాలివి. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అందించిన వివరాలను ప్రస్తావిస్తూ.. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 687 మంది పోలీసు కస్టడీలో మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. ఒక్క గుజరాత్‌లోనే 81 మరణాలు నమోదయ్యాయని చెప్పారు. మహారాష్ట్రలో 80 ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌ (50), బిహార్‌ (47), ఉత్తర్‌ప్రదేశ్‌ (41), తమిళనాడు (36)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఏడాది వారిగా చూసుకుంటే.. 2022-23లో 164 మంది, 2021-22లో 175 మంది, 2020-21లో 100 మంది, 2019-20లో 112 మంది, 2018-19లో 136 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని జైళ్లలో మగ్గుతోన్న విచారణ ఖైదీల సంఖ్య 2021 డిసెంబరు నాటికి 4.27 లక్షలకు చేరింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) రికార్డుల ఆధారంగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్ర లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘2021 డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్లలో మొత్తం 4,27,165 మంది విచారణ ఖైదీలు ఉన్నారు. నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తోందని మంత్రి అజయ్‌ కుమార్‌.. సభ దృష్టికి తీసుకొచ్చారు. నేర చట్టాలు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ మొదలైన వాటిపై సమగ్ర సమీక్ష ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు.

Exit mobile version