NTV Telugu Site icon

Gujarat Rains: గుజరాత్‌ను భారీ వర్షాలు.. 20 మంది మృతి, 23 వేల మంది సురక్షితం..

Gujarath

Gujarath

Gujarat Rains: గుజరాత్‌ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతుంది. ఇప్పటికే పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 20 మంది ప్రాణాలను విడిచారు. అలాగే, మరో 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. సుమారు 300 మంది సహాయక బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.

Read Also: Nobel Peace Prize : గాజా దురాగతాలు చూపిన నలుగురు జర్నలిస్టులకు నోబెల్ ప్రైజ్ ?

ఇక. గాంధీనగర్‌లో 2, ఆనంద్‌లో 6, మోర్బీలో 1, వడోదరలో 1, ఖేదాలో 1, మహిసాగర్‌లో ఇద్దరు మరణించారు. అలాగే, భరూచ్‌లో మరోకరు మరణించగా, అహ్మదాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 23,870 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. మరో 1,696 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే, మంగళవారం వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణవాఖ గుజరాత్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: Khushboo: ఖుష్బూకి గాయం.. అసలేమైంది?

అలాగే, రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి , గుజరాత్ సర్కార్ ఆరు ఇండియన్ ఆర్మీ బృందాల సహాయం కోరింది. దేవభూమి ద్వారక, ఆనంద్‌, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఇండియన్ ఆర్మీ, 14 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 22 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక కార్యక్రమాల్లో భాగమయ్యాయి. వర్షాల ధాటికి సురేందర్‌నగర్‌ జిల్లాలో ఓ బ్రిడ్జి కొలాప్స్ అయింది.
ఇక, భారీ వర్షాలు, సహాయక చర్యలను సమీక్షించేందకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసుల సహకారం తీసుకుని పూర్తి అప్రమత్తతతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.