Site icon NTV Telugu

Gujarat Elections: గుజరాత్ ఎలక్షన్స్.. లైవ్ అప్‌డేట్స్

Gujarat

Gujarat

గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. తొలి విడతలో మొత్తం 19 జిల్లాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్యలో త్రిముఖపోరు నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.

గతంలో 2017 ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 40, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. గుజరాత్‌లో మొత్తం 4,91,35,400 మంది ఓటర్లలో మొదటి దశ ఎన్నికల్లో 2,39,76,670 మంది ఓటు వేయనున్నారు. మొత్తం 14,382 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతుందని, అందులో 3,311 పట్టణాల్లో, 11,071 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి.

The liveblog has ended.
  • 01 Dec 2022 05:57 PM (IST)

    ముగిసిన తొలి విడత పోలింగ్

    గుజరాత్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలి విడతలో 60 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది.

  • 01 Dec 2022 03:57 PM (IST)

    మధ్యాహ్నం 3గంటల వరకు 48.48 శాతం ఓటింగ్

    గుజరాత్‌ తొలి విడత ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 01 Dec 2022 02:28 PM (IST)

    1 గంట వరకు 34.48 శాతం పోలింగ్..

    గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 34.48 శాతం ఓటింగ్ నమోదు అయింది.

  • 01 Dec 2022 01:36 PM (IST)

    140 సీట్లు బీజేపీ లక్ష్యం..

    1995 నుంచి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ వరసగా అధికారంలో ఉంది. అయితే మొత్తం 182 స్థానాలు ఉన్న రాష్ట్రంలో 2017 ఎన్నికల్లో బీజేపీ బలం 137 స్థానాల నుంచి 99కి పడిపోయింది. అయితే ఈసారి 140 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా గుజరాత్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.

     

     

  • 01 Dec 2022 12:36 PM (IST)

    11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదు..

    గుజరాత్ మొదటి విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం ఓటింగ్ నమోదు అయింది.

     

  • 01 Dec 2022 11:47 AM (IST)

    జామ్‌నగర్‌లో ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా

    స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా జామ్‌నగర్‌లో ఓటేశారు. అంతకుముందు ఆయన సతీమణి రివాబా జడేజా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

  • 01 Dec 2022 11:42 AM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..

    గుజరాత్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టార్ క్రికెటర్ రవీంద్ జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా, సోదరి నైనా జడేజా జామ్ నగర్ లో ఓటేశారు. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి, కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా, దివంగత కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ కుమర్తే ముంతాజ్ పటేల్, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నిమా బెన్ ఆచార్య ఓటేశారు.

  • 01 Dec 2022 10:20 AM (IST)

    మినీ ఆఫ్రికన్ విలేజ్ కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్..

    ఆఫ్రికన్ మూలాలు ఉన్నవారి కోసం గుజరాత్ ఎన్నికల్లో ప్రత్యేక బూత్ ఏర్పాటు చేశారు. జంబూర్ లో తొలిసారిగా ఈ ప్రత్యేక గిరిజన బూత్ ఏర్పాటు చేశారు. జునాగఢ్ కోట నిర్మిస్తున్న సమయంలో ఆఫ్రికా నుంచి గుజరాత్ కు వచ్చారు వీరంతా. కాలక్రమేణా గుజరాత్ సంప్రదాయంలో భాగమయ్యారు.

  • 01 Dec 2022 10:15 AM (IST)

    9 గంటల వరకు 4.92 శాతం పోలింగ్ నమోదు

    గుజరాత్ తొలి విడుత ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 4.92 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ వెల్లడించింది.

  • 01 Dec 2022 09:12 AM (IST)

    ఓటుహక్కు వినియోగించుకున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి

    గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆయన  సతీమణి అంజలీ రూపానీ రాజ్‌కోట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

     

     

  • 01 Dec 2022 08:40 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న రవీంద్ర జడేజా భార్య రివాబా

    స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రివాబా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. బీజేపీ నుంచి జామ్‌నగర్ నార్త్ నుంచి రివాబా జడేజా పోటీలో ఉన్నారు.

  • 01 Dec 2022 08:08 AM (IST)

    ప్రారంభం అయిన గుజరాత్ పోలింగ్..

    గుజరాత్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కచ్-సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  • 01 Dec 2022 07:54 AM (IST)

    గుజరాత్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి: సీఈసీ రాజీవ్ కుమార్.

    గుజరాత్ నేడు ప్రజాస్వామ్య పండుగ జరుపుకుంటుందని అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈ రోజు, డిసెంబర్ 5న జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తరుపున విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఈ సారి 4.9 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  • 01 Dec 2022 07:25 AM (IST)

    గుజరాత్ ఎన్నికల్లో త్రిముఖ పోరు..

    గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. తొలి విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. గత రెండు దశాబ్ధాలుగా బీజేపీకి గుజరాత్ కంచుకోటగా ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో, కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి మాత్రం రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆప్ గుజరాత్ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది.

Exit mobile version