Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- జానపద గాయకుడిపై భక్తులు నోట్ల వర్షం
- గానం ఆపకుండా పాడిన గాయకుడు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత్‌లోనూ.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ కష్టాలు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇప్పుడు భారత్‌లో కూడా ప్రధాని దగ్గర నుంచి పౌరులంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గుజరాత్‌లోని ఓ జానపద గాయకుడిపై లక్షల రూపాయల నోట్లు కుమ్మరించడం వివాదాస్పదమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జునాగఢ్ జిల్లా ఖంభాలియా గ్రామంలో సంప్రదాయ ‘డైరో’ కార్యక్రమం జరిగింది. డైరో అనేది గుజరాత్లో సంగీతం, కథలు, హాస్యాన్ని మేళవించి నిర్వహించే ప్రత్యేక జానపద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గాయకుడు గోపాల్ సాధు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుతుండగా భక్తులు పరవసించిపోయారు. ఇంకేముంది.. బ్యాగుల నిండా భారీగా నోట్ల కట్టలను తీసుకొచ్చి కుమ్మరించారు. సంచుల్లో తీసుకొచ్చిన డబ్బును వేదికపైనే కుమ్మరించడంతో గోపాల్ సాధు దాదాపు నోట్ల కుప్పలో కనిపించకుండా పోయారు. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం ఆగకుండా తన గానం కొనసాగించారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇదే అసలు వర్క్ ఫ్రం హోమ్.. కూర్చొని నోట్ల వర్షంలో తడుస్తున్నారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా.. “అంత డబ్బు మధ్యలో కూడా ప్రశాంతంగా పాడుతున్నారు” అంటూ మరొకరు స్పందించారు. ఇంకొందరు ఈ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.
ఇదే తరహా ఘటనలు గుజరాత్లో గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2023లో వల్సాద్‌లో నిర్వహించిన భజన కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు కీర్తిదాన్ గడ్వీపై కూడా రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్ల వర్షం కురిసింది. అలాగే 2022లో నవ్సారీలో జరిగిన మరో కార్యక్రమంలో ఆయనపై సుమారు రూ.50 లక్షల విలువైన నోట్లను భక్తులు కురిపించారు.
గుజరాత్లో జానపద సంగీత కార్యక్రమాల్లో గాయకులపై నగదు నోట్ల వర్షం కురిపించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించే సంప్రదాయం కూడా ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!