గుజరాత్ లో అక్రమ మద్యానికి ప్రజలు పిట్టల్లా రాతున్నారు. గుజరాత్ బోటాడ్ జిల్లాలో విషపూరితమైన మద్యం సేవించడం వల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉంటే అక్రమ మద్యం వల్ల ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలోమ 28 మంది మరణించారు. బోటాడ్ జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది మరణించగా.. ఈ రోజు మృతుల సంఖ్య 28కి చేరినట్లు డీజీపీ ఆశిష్ భాటియా వెల్లడించారు. ఈ విషాదకర ఘటనపై బర్వాలా, రాన్‌పూర్ మరియు అహ్మదాబాద్ రూరల్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
Read Also: Tamil Nadu: పరువు హత్య.. కూతురు, అల్లుడిని దారుణం హతమార్చిన తండ్రి
భావ్ నగర్, బోటాడ్, బర్వాలా, ధంధూకాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపుగా 30 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున బర్వాలా తాలూకాలోని రోజిద్ గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగా తీవ్ర అస్వస్థతకు గురువ్వడంతో వారందరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. ఈ కల్తీ మద్యాన్ని విక్రమిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు డిఫ్యూటీ సూపరింటెండెంట్ ర్యాంకు కలిగిన పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ప్రతేక్య దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై విచారణ చేయడంతో పాటు నకిలీ మద్యాన్ని విక్రయించిన నిందితుల కోసం వేట కొనసాగుతోంది. గతంలో బీహార్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగాయి. ఈ కేసులో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ కూడా విచారణలో భాగం అవుతోంది.
