Site icon NTV Telugu

GST Rate Hike: ఇక వీటిపై జీఎస్టీ బాదుడు షురూ..

Gst Rate Hike

Gst Rate Hike

సామ్యాన్యులపై మరో బాదుడు షురూ కానుంది. ఉప్పు నుంచి పప్పు దాకా, కూరగాయల నుంచి పాల పాకెట్‌ దాకా పెరిగిపోతున్న వస్తువుల ధరల దరువుకు సామాన్యులు అల్లాడుతున్న జనాలకునేటి నుంచి నిత్యావసర సరుకులపై గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ విధింపు అనివార్యంమైంది. ఈనేపథ్యంలో.. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చు పెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు.

అయితే.. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కాగా..ఈ సమావేశంలో పలు రకాల నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు విధింపు నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన కొత్త జీఎస్టే రేట్లు ఇవాళ నుంచి అమల్లోకి రానుంది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్‌ అధ్యక్షతన జూన్‌లో రెండు రోజుల పాటు వస్తు సేవల పన్ను మండలి సమావేశంలో కొత్త జీఎస్టీని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌ ప్రకారం, జులై 18 నుంచి ప్రీ ప్యాక్‌డ్‌ అండ్‌ ప్రీ లేబుల్డ్‌ రీటైల్‌ ప్యాకెట్‌ ఉత్పత్తులపై జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు పెరుగు, లస్సీ, బటర్‌ మిల్క్‌ ప్యాకెట్లపై 5 శాతం అన్నమాట. అంతేకాకుండా.. చెక్కులు జారీ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్టీ, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌లో 12 శాతం నుంచి 18 శాతానికి సవరించాలని కౌన్సిల్ సిఫారసుతో.. ఎల్ఈడీ లైట్లు.. మ్యానిఫ్యాక్చరింగ్‌ ఇండస్ట్రీలో ఉపయోగించే ఫిక్సర్లు, ఎల్ఈడీ ల్యాంప్స్ ధరలు పెంపునకు సిద్ధంగా ఉన్నాయి.

ఆసుపత్రి గదులు, హోటల్స్ రూమ్స్‌
అయితే.. ప్రతి రోగికి రోజుకు రూ.5000 కంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రి గది అద్దె ఐసీయూ మినహాయించి ఐటిసి లేకుండా గదికి 5 శాతం వసూలు చేయనున్నారు. ఈనేపథ్యంలో.. దీనికి గూడ్స్ యాడ్ సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉండేది. అయితే.. ప్రస్తుతం పన్ను మినహాయింపు కేటగిరీకి భిన్నంగా హోటల్ గదులను రోజుకు వెయ్యి లోపు కాగా.. 12 శాతం జీఎస్టి శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టి కౌన్సిల్ నిర్ణయించింది.

Minister Chelluboina Venu Gopala Krishna: వరదలపై చంద్రబాబు వ్యాఖ్యలు మిలీనియం జోక్..!

Exit mobile version