PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
- GSLV-F17 విజయంపై ప్రధాని మోడీ ప్రశంసలు
- భారత అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Praises ISRO for GSLV-F17 Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక విజయాన్ని నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆయన దేశానికి గర్వకారణమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో ఉన్న అత్యుత్తమ ప్రతిభ, ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు ప్రతిబింబం అని పేర్కొన్నారు.
GSLV-F17 విజయంపై మోడీ ఏమన్నారు?
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xలో ప్రధాని మోడీ స్పందిస్తూ.. GSLV-F17/EOS-05 ప్రయోగం ISROకు మరో అద్భుతమైన విజయమని అన్నారు. భారత్ తొలిసారిగా జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ సామర్థ్యం కలిగిన ఉపగ్రహాన్ని ప్రయోగించిందని పేర్కొంటూ.. ఈ మిషన్ దేశ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలను చాటిచెబుతోందన్నారు. ISROతో భారత పరిశ్రమల భాగస్వామ్యం పెరుగుతుండటం అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృత స్థాయిని అందిస్తోందని మోడీ తెలిపారు. దీని ద్వారా దేశంలోని మొత్తం స్పేస్ ఎకోసిస్టమ్ సామర్థ్యాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు.
Also Read
- Sugar Price: సామాన్యులకు గుడ్‌న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
విజయవంతంగా కక్ష్యలోకి EOS-05
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. అనంతరం ఉపగ్రహాన్ని నిర్దేశిత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టినట్లు ISRO వెల్లడించింది. EOS-05 సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి భారత్‌ను నిరంతరం పరిశీలించే సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం. దీని ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన కీలక భౌగోళిక, పర్యావరణ సమాచారాన్ని సేకరించేందుకు అవకాశం ఉంటుంది.
‘స్పై శాటిలైట్ కాదు’.. ISRO చైర్మన్
EOS-05ను స్పై శాటిలైట్‌గా పేర్కొనడాన్ని ISRO చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ తోసిపుచ్చారు. దేశ ప్రజల భద్రత, రక్షణ అవసరాలకు ఉపయోగపడేలా భారత్‌ను పరిశీలించడమే ఈ ఉపగ్రహం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ ఉపగ్రహం ద్వారా అధునాతన ఇమేజింగ్ సాంకేతికతను ఉపయోగించి దేశానికి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు.
ISROకు జితేంద్ర సింగ్ అభినందనలు
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా GSLV-F17/EOS-05 విజయంపై ISRO శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష రంగంలో ‘భారీ ముందడుగు’గా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని, ప్రపంచ స్థాయి స్పేస్ పవర్‌గా భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని అన్నారు.
అత్యాధునిక ఇమేజింగ్ సామర్థ్యాలు
జితేంద్ర సింగ్ ప్రకారం EOS-05 ఒక అత్యాధునిక Earth Observation Satellite. ఇది విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మల్టీ-స్పెక్ట్రల్, హైపర్‌స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాలను అందించనుంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, భూ వినియోగం వంటి అనేక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది.
భారత్ స్పేస్ ఎకానమీలో మరో ముందడుగు
GSLV-F17/EOS-05 విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో తన సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. ముఖ్యంగా ISRO–భారత ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విజయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయడం ద్వారా భారత స్పేస్ ఎకానమీ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
-
Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
-
Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!