Site icon NTV Telugu

Yogi gets a Bulldozer in dowry: అల్లుడి పేరు యోగి.. బుల్డోజర్ కట్నంగా ఇచ్చిన మామ..

Bulldozer

Bulldozer

ఇప్పుడు కూతురుకు పెళ్లి చేయాలంటే చాలా మందికి కష్టంగా మారింది.. అప్పులు చేసిమరి.. అల్లుడు అడిగింది కట్నం కింద ఇవ్వాల్సి వస్తుంది.. కొందరు తమ తాహతు కొద్దీ కట్నకానుకలు ఇస్తుంటే.. మరికొందరు.. పెళ్లి కోసం ఉన్నది అమ్మికూడా ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కొందరు కార్లు, బైక్‌లు, బంగారం, భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు కొనిస్తుంటే.. మరికొందరేమో ఇంట్లో ఉపయోగించే సామగ్రి ఇచ్చి ఒప్పించుకుంటున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఓ తండ్రి.. తన కూతురుకి పెళ్లి కానుకగా ఓ బుల్డోజర్‌ను కొనిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.. ఇక్కడో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది.. ఏంటంటే.. పెళ్లి కుమారుడి పేరు యోగి.. కట్నం కింద వచ్చింది బుల్డోజర్.. అసలే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చి యోగి ఆదిత్యానాథ్ సీఎం అయిన తర్వాత బుల్డోజర్ హల్‌చల్‌ చేస్తున్న విషయం విదితమే.

Read Also: Pawan Kalyan ‘The Real Yogi’ : చిరంజీవి తమ్ముళ్లు అయినంత మాత్రాన సినిమాలు ఎవ్వరూ ఇవ్వరు

ఇక, పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హమీర్‌పూర్‌ జిల్లాలోని సుమెర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌గావ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ జవాన్‌ పరశురామ్ ప్రజాపతి.. తాజాగా, తన కుమార్తె నేహాకు నౌకాదళంలో పనిచేస్తున్న సౌఖర్ గ్రామానికి చెందిన యోగేంద్ర అలియాస్ యోగి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు.. ఈ నెల 15వ తేదీన ఘనంగా వివాహం జరిగింది.. అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.. ఈ సమయంలో.. అక్కడికి బుల్డోజర్ ఎట్రీ ఇచ్చింది.. అంతా ఆశ్చర్యపోయారు.. విషయం ఏంటంటే.. తన కుమార్తె నేహాకు కట్నంగా బుల్డోజర్‌ను ఇచ్చాడు పరశురామ్‌.. ఇక్కడ అల్లుడి పేరు యోగి.. బుల్డోజర్ కానుకగా ఇవ్వడంతో ఇప్పుడా వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.. అయితే, ఓ వరుడికి బుల్‌డోజర్‌ కట్నం రావడం ఇదే తొలిసారి కావొచ్చు మరి.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యూపీ బుల్డోజర్లపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.. బుల్డోజర్లకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడు కానకగా ఇవ్వడం వైరల్‌గా మారిపోయింది..

అయితే, లగ్జరీ కారు కాకుండా కట్నంలో బుల్డోజర్ ఎందుకు ఇచ్చారు? అని పెళ్లి కూతురు తండ్రిని అడిగితే.. తన కూతురు ప్రస్తుతం యూపీఎస్సీకి సిద్ధమవుతోందని పరశురామ్ ప్రజాపతి చెప్పారు. ఆమెకు ఉద్యోగం రాకపోతే, బుల్డోజర్ ఆమెకు డబ్బులు సంపాదించడానికి సహాయం చేస్తుందని చెప్పుకొచ్చాడు.. ఇక్కడ తండ్రి లాజిక్‌ కూడా బాగుంది.. మరోవైపు, యోగికి కట్నంగా బుల్డోజర్ పొందడం చర్చనీయాంశంగా మారింది. తనది వ్యవసాయ కుటుంబమని యోగి చెప్పారు. తాను కట్నం తీసుకోవడానికి నిరాకరించానని, ఎలాంటి డిమాండ్ చేయలేదని, అయితే మామగారు బుల్డోజర్ ను సర్‌ప్రైజ్‌గా బహుమతిగా ఇచ్చారని చెప్పాడు.. పెళ్లిలో బుల్డోజర్ కానుకగా ఇచ్చారన్న వార్త వైరల్‌గా మారడంతో జనాలు దాని గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. బుల్డోజర్‌ను చూసేందుకు ప్రజలు యోగి ఇంటికి చేరుకుంటున్నారు.

Exit mobile version