Govt employees terminated for terror links:జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల అణిచివేతలో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించింది ప్రభుత్వం. వీరందరిని విధుల నుంచి తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని నిబంధనలు 311(2)సి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసుల నుంచి తొలిగించారు. ఉగ్రవాదులతో సంబంధాలు, నార్కో-టెర్రర్ సిండికేట్లను నడుపుతున్నందుకు, ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు నిషేధిత సంస్థలకు సహాయం చేసినందుకు ఈ ఐదుగురిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు గత ప్రభుత్వాల సహాయంతో వీరంతా డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇలాంటి అనేక టెర్రరిస్టు సానుభూతిపరులు ప్రభుత్వ వ్యవస్థలో తిష్ట వేశారు. ఉద్యోగాల నుంచి తొలిగించిన వారిలో తన్వీర్ సలీమ్ దార్ కానిస్టేబుల్ గా ఉన్నాడు.
Read Also: Priya Bhavani Shankar: సత్యదేవ్ మూవీతో కోలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ!
1991లో విధుల్లో చేరిన తన్వీర్ జూలై 2002లో బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో ‘ఆర్మర్’పోస్టులో చేరాడు. ఉగ్రవాదుల ఆయుధాలను రిపేర్ చేయడంతో పాటు మందుగుండు సామాగ్రిని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నట్లు తేలింది. శ్రీనగర్ లోని లష్కరే తోయిబా అత్యంత ముఖ్యమైన ఉగ్రవాద కమాండర్, లాజిస్టిక్ ప్రొవైడర్ గా పనిచేస్తున్నాడు. తన్వీర్ శ్రీనగర్ లో జరిగిన వరస ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఎమ్మెల్సీ జానైద్ షల్లా హత్యలో కీలక పాత్ర పోషించాడని తరుపరి విచారణలో తేలింది.
మరో ఉద్యోగి అఫాక్ అహ్మద్ వనీ బారాముల్లా జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇఫ్తికార్ ఆంధ్రాబీ ప్లాంటేషన్ సూపర్ వైజర్ గా, ఇర్షాద్ అహ్మద్ ఖాన్ 2010లో జల్ శక్తి డిపార్ట్మెంట్ అర్డర్లీగా నియమితమయ్యాడు. అబ్దుల్ మోమిన్ పీర్ 2014లో పీహెచ్ఈ సబ్ డివిజన్ అసిస్టెంట్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. వీరందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించడంతో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించారు.
