NTV Telugu Site icon

Yogi Adityanath: నేరస్థులకు ప్రభుత్వం హారతి పట్టదు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

Up Cm

Up Cm

UP CM Yogi Adityanath: నేరస్థులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ సమర్థించుకున్నారు. నేరస్థుల ఇళ్లపై ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్‌ ఆపరేషన్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమర్థించారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతులు పట్టాలా..? అంటూ మండిపడ్డారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందిస్తూ.. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతి ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆపరేషన్‌ సరైనదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఆస్తులను ఇష్టారీతిగా ఆక్రమించుకున్నారని.. గత ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేదని సీఎం యోగి మండిపడ్డారు.

Read also: CM KCR: అన్నాభావు సాఠే చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు

మైనారిటీ వర్గానికి చెందిన నేరస్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టారని వచ్చిన ఆరోపణలను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ‘‘దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. అందరికీ న్యాయం చేసేందుకు కోర్టులు ఉన్నాయి. ఇంతవరకు ఒక మైనారిటీ వచ్చి తనకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేయలేదు. రాష్ట్ర ప్రజలందరికీ సమాన పరిపాలన, భద్రత అమలవుతోందని ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్‌ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి అల్లర్లు జరగలేదని.. ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని వివరించారు. ఈ సందర్భంగా తృణముల్‌ కాంగ్రెస్‌పై యోగి మండిపడ్డారు. ఆ పార్టీ దేశాన్ని మరో పశ్చిమ బెంగాల్‌గా మార్చాలనుకుంటోందని విమర్శించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో గ్రామీణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి వ్యక్తికి ఉందని యోగి ఆదిత్యనాథ్‌ గుర్తు చేశారు.