Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..

  • వంట నూనెల్లో మోసాలకు చెక్..
  • ఇకపై 800 గ్రాములు, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్..
  • 9 రకాల పరిమాణాల్లోనే ప్యాకేజింగ్ ఉండాలని కేంద్రం ఆదేశం..
Cooking Oil

Cooking Oil

Cooking Oil: వంట నూనెల విషయంలో వినియోగదారుడిని తప్పుదారి పట్టించే మోసాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. నిర్ధిష్ట పరిమాణాల్లోనే పాక్యేజింగ్ ఉండాలని ఆదేశించింది. ఇకపై 200గ్రా, 500గ్రా, 1కిలో, 2కిలోలు, 3కిలోలు, 4కిలోలు, 5కిలోలు, 15కిలోలు, 20కిలోల వంటి 9 రకాల ప్యాకేజింగ్‌లు ఉండాలని నిర్దేశించింది. దీని వల్ల వినియోగదారులు ధరలను సులభంగా పోల్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ 9 రకాల పరిమాణాల్లోనే పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆవ నూనె, వేరుశెనగ, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, కార్న్ ఆయిల్, మిశ్రమ వంట నూనెల్ని విక్రయించాల్సి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా కంపెనీలు వ్యూహాత్మకంగా ధర పెంచకుండా, తమ ప్యాకేజ్‌లను ఒక కిలోకు బదులుగా 800 గ్రాములు, 900 గ్రాముల ప్యాకెట్లుగా విక్రయిస్తున్నారు. దీనిని చూసిన వినియోగదారుడు 1 కిలో ప్యాకెట్‌గా భ్రమపడుతున్నాడు. దీని వల్ల 1 కిలో లేదా 1 లీడర్ ఉందని వినియోగదారుడు కొనుగోలు చేస్తున్నాడు. దీని వల్ల వాస్తవ పరిణామానికి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.

×
×
Ad

ఈ దోపిడీని అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అ3మలు చేయడానికి తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు లోగా కొత్త ప్రమాణాలు పాటించాలి. ఇదే సమయంలో నూనె పరిమాణాన్ని లీటర్లు లేదా మిల్లీ లీటర్లలో పేర్కొన్నట్లియతే, దానికి సమానమైన బరువును గ్రాముల్లో కానీ కిలోగ్రాముల్లో కానీ స్పష్టంగా ప్యాకెట్‌పై ముద్రించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) స్వాగతించింది.