NTV Telugu Site icon

Google: గూగుల్‌కు షాక్.. రూ. 1,337 కోట్ల ఫైన్ కట్టాల్సిందే

Google

Google

Google: టెక్ దిగ్గజం గూగుల్ కు షాక్ ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ). 30 రోజుల్లో రూ. 1337.76 కోట్ల జరిమానాను కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి, గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ. 1337 కోట్ల జరిమానాను విధించింది. దీనిపై గతంలో గూగుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఉపశమనం దక్కలేదు. దీనిపై స్టే ఇవ్వాలని సుప్రీంను కోరింది. అయితే ఈ కేసుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసును మార్చి 31 లోెగా తేల్చాలని ఎన్సీఎల్ఏటీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు తీర్పు చెబుతూ.. ట్రిబ్యునల్ ఫైన్ కట్టాల్సిందే అని గూగుల్ ను ఆదేశించింది.

Read Also: Karnataka: కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ తలనొప్పి.. నోట్లు వెదజల్లడంపై విమర్శలు..

దేశంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై గూగుల్ గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తోందని సీసీఐ జరిమానా విధించింది. దేశంలో ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత ఫోన్ల వినియోగమే ఎక్కువ. ఈ ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ లో గూగుల్ ఆండ్రాయిడ్ ది 97 శాతం. అయితే నిబంధనలకు, భారతీయ చట్టాలకు విరుద్ధంగా తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని ప్రధాన ఆరోపణ. గూగుల్ సంస్థ యూరప్ దేశాల్లో ఒకలా భారత్ తో మరోలా వ్యవహరిస్తోందని సీసీఐ గతంలో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఈ కేసులో గత ఏడాది సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత గూగుల్ భారత్ లోని ఆండ్రాయిడ్ కు భారీ మార్పులు చేసింది. వీటిలో మొబైల్ తయారీదారులు వ్యక్తిగత యాప్ లను ప్రీ-ఇన్‌స్టాలేషన్ కోసం అనుమతించడం, వినియోగదారులు వారి డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్ ఎంచుకోవడం వంటి వాటిని మార్చింది. గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, యూట్యూబ్ వంటి వాటిని ముందే అన్ ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారులకు గూగుల్ అనుమతించాల్సిన అవసరం లేదు. గతంలోొ వీటిపై గూగుల్ ఇష్టారాజ్యం నడిచేది. అందుకే సీసీఐ ఫైన్ విధించింది.

Show comments