NTV Telugu Site icon

India Russia: ఇండియన్స్‌కి గుడ్ న్యూస్.. వీసా లేకుండా రష్యాకు వెళ్లొచ్చు..

Modi Putin

Modi Putin

India Russia: ఇండియా రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే రక్షణ, ఆయుధాలు, ఎరువులు, చమురు వంటి వాటి భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్ధాలుగా రష్యా భారత్‌కి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటోంది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ రష్యా సంబంధాలను చరిత్రను పరిశీలిస్తే, రష్యా భారత ప్రయోజనాలకు విరుద్ధంతా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు.

Read Also: Bangalore:12 ఏళ్లు బెంగళూరులో బంగ్లాదేశ్‌ వాసి.. పోలీసులకు పట్టించిన మొదటి భార్య

ఇదిలా ఉంటే, భారత్ నుంచి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంటోంది. త్వరలో భారతీయులకు వీసా-ఫ్రీ సదుపాయం కల్పించేందుకు రష్యా సిద్ధమవుతోంది. భారత్ రష్యాల మధ్య టూరిజం బాగా పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 28,500 మంది భారతీయులు రష్యాలో పర్యటించారు. గతేడాదితో పోలిస్తే పర్యాటకుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. గతేడాది 9000 మందికి మాత్రమే వీసాలు జారీ అయ్యాయి. రష్యాకు వచ్చే పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య ఆరు శాతం. రష్యా వీసాలను పొందిన దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది.

వ్యాపార వాణిజ్య కారణాల వల్ల రష్యాలో పర్యటించే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. గతేడాది ఆగస్టు 1 నుంచి దరఖాస్తు చేసిన 4 రోజుల్లోనే వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదే కాకుండా భారతీయులు ఏడాది పొడవునా వివిధ వాణిజ్య, వ్యాపార చర్చల కోసం రష్యాకు వెళ్తున్నారు. వాణిజ్య టూరిజానికి రష్యా కేంద్రంగా మారుతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం భారతీయులు రష్యాకు వెళ్తున్నారు. దీంతోనే భారతీయులకు వీసా లేకుండా రష్యాలో పర్యటించే సదుపాయాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.