NTV Telugu Site icon

Sonali Phogat: సోనాలీ ఫోగాట్ నివాసంలో 3 డైరీలు స్వాధీనం.. వాటిలో ఏముంది?

Sonali Phogat

Sonali Phogat

Sonali Phogat: బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సంత్‌నగర్‌ ప్రాంతంలో గల దివంగత నటిసోనాలి ఫోగాట్ నివాసంలో గోవా పోలీసులు వరుసగా మూడో రోజు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. సోనాలి ఫోగాట్ బెడ్‌రూమ్, వార్డ్‌రోబ్, పాస్‌వర్డ్ రక్షిత లాకర్‌ను పోలీసు సెర్చ్ టీమ్ తనిఖీ చేసింది. సోనాలి ఫోగాట్ నివాసంలోని లాకర్‌ను కూడా పోలీసులు సీల్ చేశారు.

ఈ డైరీల్లో ఏముందనే విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఇందుల్లో తన వ్యక్తిగత సహాయకుడైన సుధీర్ సంగ్వాన్ ద్వారా జరిపిన లావాదేవీల వివరాలు అందులో రాసుకున్నారని సమాచారం. హరియాణా సహా పలు రాష్ట్రాల్లో సోనాలీ పెట్టుబడుల వివరాలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. సోనాలీ ఫోగాట్ మృతి కేసు ఇంకా కొలిక్కి రాలేదని.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని గోవా పోలీసులు వెల్లడించారు.

Sukesh Chandrashekar Case: నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

గోవా పర్యటనకు వెళ్లిన సోనాలి అనుమానాస్పద రీతిలో మృతి ప్రాణాలు కోల్పోయింది. తొలుత గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని, అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ సహాయకులైన సుధీర్‌ సంగ్వాన్‌, సుఖ్వీందర్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. సోనాలీ తన సహాయకుడైన సుధీర్‌తో సహజీవనం చేశారనే వార్తలు వస్తున్నాయి. వారిద్దరు కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారని కథనాలు వెలువడ్డాయి. ఆస్తి కోసమే ఆమె హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసులో మరో మలుపు తిరిగింది.

తన టిక్‌టాక్ వీడియోలతో ఖ్యాతి గడించిన నటి సోనాలీ ఫోగాట్, 2019 హర్యానా ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. ఆమె 2020లో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా కనిపించింది.