Site icon NTV Telugu

Goa Fire Accident: గోవా అగ్ని ప్రమాద రెస్టారెంట్ యజమానులు అరెస్ట్..

Luthra Brothers Arrest

Luthra Brothers Arrest

Goa Fire Accident: గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రాలను గోవా పోలీసులు పట్టుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్‌కు పారిపోయిన లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్‌లను సస్పెండ్ చేశారు. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A రూల్స్ ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొనింది. దీంతో లూథ్రా బ్రదర్స్ విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంది. లూథ్రా సోదరులు డిసెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 1:17 గంటలకు విమాన టిక్కెట్లను బుక్ చేసుకుని.. అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానంలో థాయ్ లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది.

Read Also: Pithapuram: పిఠాపురంలో అర్థరాత్రి మహిళపై కత్తితో దుండగులు దాడి

అయితే, ప్రస్తుతం థాయ్ లాండ్‌లోని ఫుకెట్‌లో ఉన్న లుథ్రా బ్రదర్స్ను థాయ్‌లాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే, లూథ్రా బ్రదర్స్ కి గోవా పోలీసులు లుక్-అవుట్ నోటీసులు, ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసులను ఇచ్చింది. కాగా, నైట్‌క్లబ్ యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను అరెస్టు చేయగా.. అతడు మాట్లాడుతూ.. తాను లూథ్రాలతో కేవలం స్లీపింగ్ పార్టనర్‌ను మాత్రమేనని తెలియజేశాడు. కాగా, ఈ కేసుపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్రంగా మండిపడ్డారు. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.

Exit mobile version