Global Gender Gap Index:135వ స్థానంలో ఇండియా.. టాప్ 10 దేశాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లింగ సమానత్వ సూచీలో ఇండియా పూర్ ఫెర్ఫామెన్స్ కనబరిచింది. చివరి వరసలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లింగ సమానత్వ సూచీ 2022( జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022)లో పొరుగు దేశాల కన్నా వెనకబడి ఉంది. మొత్తం 146 దేశాల్లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. మన తర్వాత మరో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (71), నేపాల్ (96), శ్రీలంక(110), మాల్దీవులు (117), భూటాన్ (126) కన్నా ఇండియా వెనకబడి ఉంది. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, కాంగో, ఇరాన్, చాద్ దేశాలు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ప్రస్తుత రిపోర్ట్ ప్రకారం లింగ సమానత్వం సాధించాలంటే 132 ఏళ్లు పడుతుందని పేర్కొంది. దక్షిణాసియా లింగ సమానత్వాన్ని సాధించాలంటే 197 సంవత్సరాలు పడుతుందని..నివేదిక పేర్కొంది. 2021 ఏడాదిలో 156 దేశాల్లో ఇండియా 140వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 4 అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యా సాధన, ఆరోగ్యం- మనుగడ, రాజకీయ సాధికారత అంశాల ఆధారంగా సున్నా నుంచి 100 వరకు స్కోర్ ఇస్తారు. ఆర్థిక భాగస్వామ్య- అవకాశాల్లో 143వ స్థానంలో, విద్యా సాధనలో 107వ స్థానంలో, రాజకీయ సాధికారతలో 48వ స్థానంలో నిలిచింది. ‘ ఆరోగ్యం- మనుగడ’ సూచిలో ఇండియా అట్టడుగున 146వ స్థానంలో నిలిచింది.
Also Read
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
- Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
Read Also: Cheating: వీడు మామూలోడు కాదు.. 11 మందితో పెళ్లి.. కొండాపూర్‌లోనే ఏడు..
జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022లో ఐస్ లాండ్ మొదటిస్థానంలో ఉంది. 90 శాతం కన్నా ఎక్కువ లింగ సమానత్వం ఒక్క ఐస్ లాండే నమోదు చేసింది. తరువాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ దేశాలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. ఆఫ్రికా దేశాలైన రువాండా 6వ స్థానంలో, నమీబియా 8వ స్థానంలో ఉన్నాయి. నికరాగ్వా 7వ స్థానంలో, ఐర్లాండ్ , జర్మనీ 9,10 వ స్థానాల్లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్‌లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!