ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని దీహ్ గ్రామంలో జరిగిన ఒక నాటకీయ సంఘట చోటుచేసుకుంది. దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేయనందుకు తన తల్లి తిట్టినందుకు నిరసనగా ఒక యువతి మొబైల్ టవర్ ఎక్కింది. ఇంట్లో ఉన్న తన సోదరుడు తనకు హెల్ప్ చేయలేదని నిరాశ చెందిన యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Read Also: Tragedy: కొడుకు మరణ వార్త విన్న తల్లి.. కొద్ది సేపటికే..
మన దేశంలో చాలా ఇళ్లలో అమ్మాయిలే ఇంటి పనులు చేస్తారు. ఇక్కడ కూడా తల్లి తన కూతురిని దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్రం చేయమని అడిగింది. కానీ తన సోదరుడికి కాకుండా తనను మాత్రమే పనులు చేయమని అడగడం ఆ యువతికి నచ్చలేదు. దీంతో మనస్తాపం చెంది, టవర్ ఎక్కి నిరసన తెలిపింది. కూతురు టవర్ ఎక్కడంతో తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు భయపడ్డారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి, నచ్చజెప్పి, ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురక్షితంగా కిందకు దిగింది. ఆమెను మళ్లీ కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Also:Shocking News: కొండపై నుంచి దూకి బాలికల ఆత్మహత్యాయత్నం..
బాలికను సురక్షితంగా కిందకు దించడానికి విజయవంతంగా ఒప్పించారు. “తన తల్లి తన సోదరుడిని కాపాడుతూ ఇల్లు శుభ్రం చేయమని కోరినందుకు ఆమె కోపంగా ఉంది” అని మీర్జాపూర్ సర్కిల్ ఆఫీసర్ అమర్ బహదూర్ అన్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో సురక్షితంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా చూపకుండా అందరినీ సమానంగా చూసుకోవాలని, ఇంటి పనులు అందరూ పంచుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
मिर्जापुर में एक युवती को उसकी माँ ने दीपावली पर साफ सफाई को लेकर फटकार लगाई थी, युवती गुस्से में मोबाइल टावर पर चढ़ गयी और ड्रामा किया…#Mirzapur #Video #VideoViral #LiveVideo pic.twitter.com/TdEszqODWi
— Gaurav Kumar (@gaurav1307kumar) October 17, 2025