UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్‌కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..

  • యూపీలో అసద్ ఎన్‌కౌంటర్‌తో రాజకీయ ఉద్రిక్తత..
  • సూర్య చౌహాన్‌ను హత్య చేసిన అసద్‌ను హతమార్చిన పోలీసులు..
  • యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై ఎస్పీ, కాంగ్రెస్ విమర్శలు..
Up Encounter

Up Encounter

UP Encounter: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అసద్ ఎన్‌కౌంటర్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఘజియాబాద్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి సూర్య చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్లో హతమార్చారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై, యూపీ పోలీసులపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. చౌహాన్ హత్య తర్వాత పరారీలో ఉన్న అసద్‌ను పట్టుకునే ప్రయత్నాలు చేశారు. అతడిపై రూ. 50,000 రివార్డు కూడా ప్రకటించారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ గాయపడి, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ ఘటనపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అమీక్ జమై రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. నేరగాళ్లెు పోలీసులకు భయపడటం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో యూపీని సైన్యానికి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉమాశంకర్ పాండే ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించారు. నేర నియంత్రణకు ఎన్‌కౌంటర్ పరిష్కారం కాదని, చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా నేరస్తుల్ని శిక్షించాలని అన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ మార్గాలను ఉపయోగిస్తుందని మండిపడ్డారు.

×
×
Ad

బక్రీద్ రోజున సూర్య చౌహాన్‌ను అసద్ అతడి ఇతని స్నేహితులు కలిసి చంపారు. అసద్, సూర్య కూడా స్నేహితులే. బైక్ వివాదం చివరకు హత్యగా మారినట్లు పోలీసులు తెలిపారు. అసద్ తండ్రి ఈ హత్యకు పురిగొల్పినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.