UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
- యూపీలో అసద్ ఎన్‌కౌంటర్‌తో రాజకీయ ఉద్రిక్తత..
- సూర్య చౌహాన్‌ను హత్య చేసిన అసద్‌ను హతమార్చిన పోలీసులు..
- యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై ఎస్పీ, కాంగ్రెస్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Encounter: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అసద్ ఎన్కౌంటర్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఘజియాబాద్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి సూర్య చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అసద్‌ను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై, యూపీ పోలీసులపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. చౌహాన్ హత్య తర్వాత పరారీలో ఉన్న అసద్‌ను పట్టుకునే ప్రయత్నాలు చేశారు. అతడిపై రూ. 50,000 రివార్డు కూడా ప్రకటించారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో అసద్ గాయపడి, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటనపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అమీక్ జమై రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. నేరగాళ్లెు పోలీసులకు భయపడటం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో యూపీని సైన్యానికి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉమాశంకర్ పాండే ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించారు. నేర నియంత్రణకు ఎన్కౌంటర్ పరిష్కారం కాదని, చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా నేరస్తుల్ని శిక్షించాలని అన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ మార్గాలను ఉపయోగిస్తుందని మండిపడ్డారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
బక్రీద్ రోజున సూర్య చౌహాన్‌ను అసద్ అతడి ఇతని స్నేహితులు కలిసి చంపారు. అసద్, సూర్య కూడా స్నేహితులే. బైక్ వివాదం చివరకు హత్యగా మారినట్లు పోలీసులు తెలిపారు. అసద్ తండ్రి ఈ హత్యకు పురిగొల్పినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..