కంగనా వ్యాఖ్యలకు గాంధీ మునిమనవడి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గాంధీజీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరైనా ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలంటూ గాంధీ చెప్పిన సూత్రాన్ని బుధవారం నాడు కంగనా విమర్శించింది. గాంధీ చెప్పిన సిద్ధాంతంతో మన స్వాతంత్ర్యం పొందామని తనకు ఎవరో చెప్పారని… అలా ఆజాది రాదని.. కంగనా ఓ పోస్ట్ చేసింది. అయితే కంగనా వ్యాఖ్యలపై గాంధీ ముని మనవడు తుషార్ స్పందించారు.
Read Also: దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపులే.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
గాంధేయవాదులు మాత్రమే రెండో చెంప చూపిస్తారని కొందరు ఆరోపిస్తున్నారని… కానీ మరో చెంప చూపించడానికి గాంధీ ద్వేషులకు అనుకున్న దాని కంటే ఎక్కువ ధైర్యం కావాలని తుషార్ గట్టిగా సమాధానమిచ్చారు. వాళ్లు వీరత్వాన్ని అర్థం చేసుకోలేని పిరికిపందలు అని, అసమర్థులు అని విమర్శించారు. ఆనాటి భారతీయులు రెండో చెంప చూపించి ఎంతో ధైర్యాన్ని చూపించారని.. అందుకే వారంతా హీరోలు అయ్యారని తుషార్ అన్నారు. భిక్షగాడు అని పిలవడాన్ని కూడా బాపూజీ స్వాగతించారని.. తన దేశం, తన ప్రజల కోసం ఇలాంటి మాటలను గాంధీజీ పట్టించుకోలేదని తుషార్ గుర్తు చేశారు. అబద్ధాలను ఎంత బిగ్గరగా అరిచి చెప్పినా.. నిజం నిలకడగా ఉంటుందన్నారు. అయితే అబద్ధాలపై స్పందిస్తేనే నిజాలు తెలుస్తాయన్నారు.
కాగా భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో కాదని 2014లో వచ్చిందని కంగనా ఇటీవల వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు గాంధీజీ నుంచి మద్దతు లభించలేదని… అందుకే ప్రజలు తెలివిగా ఆలోచించి గాంధీకి మద్దతు ఇస్తారా లేదా నేతాజీకి మద్దతు ఇస్తారా అనే విషయం తేల్చుకోవాలని సూచించింది. దీంతో కంగనా వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది.
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..