దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపులే.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

లైంగిక వేధింపులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా బాంబే హైకోర్టు ధర్మాసనంపై అక్షింతలు వేసింది. నిందితుడు బాలిక శరీరానికి నేరుగా తాకనప్పుడు అది పోక్సో చట్టం కిందకు రాదన్న తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికలను లేదా మహిళలను దుస్తుల పై నుంచి తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోక్సో చట్టానికి బాంబే హైకోర్టు వక్రభాష్యం చెప్పేలా తీర్పు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టాలె స్పష్టంగా లేనప్పుడు నిబంధనల పేరిట కోర్టులు గందరగోళానికి తెరలేపకూడదని జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Read Also: ఏపీలో సముద్ర తీరంలో బంగారం.. ఎగబడుతున్న జనం..!

చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం కోసమే పోక్సో చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం చేయాలన్నా దురుద్దేశంతో నిందితుడు బాలికను దుస్తులపై నుంచి తాకినా నేరం కిందే పరిగణించాలని సూచించింది. నిందితుడు ఆడవారి శరీరాన్ని నేరుగా తాకాడా లేదా అన్న విషయంపై చర్చ పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో ఓ కేసు సందర్భంగా నిందితుడు బాలికను నేరుగా తాకలేదన్న కారణంతో కేసును కొట్టివేసిన బాంబే హైకోర్టు తీర్పును డిస్మిస్ చేసింది.

Related Articles

Latest Articles