Site icon NTV Telugu

Rahul Gandhi: ఒకప్పుడు చిన్నకారు.. ఇప్పుడు శీష్‌మహల్.. కేజ్రీవాల్‌పై రాహుల్‌గాంధీ విమర్శలు

Rahulganhdi

Rahulganhdi

ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరు సాగుతోంది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. తాజాగా కేజ్రీవాల్ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేజ్రీవాల్.. అవినీతి రహిత పాలన చేస్తానని చెప్పారని.. చిన్న కారులో వచ్చిన ఆయన.. ఇప్పుడు శీష్ మహల్‌లో నివసిస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని మర్మమత్తుల కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Health Tips: మూత్రంలో రక్తం పడితే.. క్యాన్సర్ వచ్చినట్టా?

అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని చెప్పిన కేజ్రీవాల్.. ఢిల్లీలో భారీ కుంభకోణమే చేశారన్నారు. కుంభకోణానికి కేజ్రీవాల్‌ రూపకల్పన చేశారని.. అందుకే నిజం బయటకి వచ్చిందని తెలిపారు. కేజ్రీవాల్‌ అత్యంత విలాసవంతమైన అద్దాల మేడలో నివాసం ఉన్నారని.. ఇప్పుడు నిజాలు బయటపడ్డాయని.. వారి రాజకీయాలు అందరికీ అర్థమయ్యాయని రాహుల్ విమర్శించారు.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్‌కి సూత్రధారి’’.. కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..

Exit mobile version