NTV Telugu Site icon

Rekha Singh: భర్త పేరు నిలబెట్టింది.. ఆర్మీ ఆఫీసర్‌గా “గాల్వాన్ హీరో” భార్య..

Rekha Singh

Rekha Singh

Rekha Singh: 2020 లడఖ్ గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ప్రతిగా భారత్ బలగాలు జరిపిన దాడిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారు. అయితే తమ వారు మాత్రం నలుగురే చనిపోయారంటూ చైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. గాల్వాన్ ఘర్షణల్లో భారత సైనికుల వీరత్వాన్ని చూసిన చైనా బలగాలు మరోసారి భారత్ పై దాడి చేసేందుకు వణికిపోతున్నాయి.

Read Also: Azam Khan: అతిక్ అహ్మద్ లాగే నన్ను చంపుతారని భయమేస్తోంది..

ఇదిలా ఉంటే గాల్వాన్ ఘర్షణల్లో మరణించిన నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖాసింగ్ భర్త పేరును నిలబెట్టింది. భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా నియమితులైందని శనివారం అధికారులు వెల్లడించారు. తూర్పు లడఖ్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి ఫ్రంట్ లైన్ బేస్ లో విధులు నిర్వహించనుంది. లెఫ్టినెంట్ రేఖా సింగ్ చెన్నైలో ఏడాది పాటు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణ తీసుకున్నారు.

గాల్వాన్ ఘర్షణల్లో అమరుడైన నాయక్ దీపక్ సింగ్ బీహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్ కు చెందినవాడు. మరణానంతరం 2021లో ఆయన త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం అత్యున్నత వీరచక్ర అవార్డుతో గౌరవించింది. దివంగత నాయక్ దీపక్ సింగ్( నర్సింగ్ అసిస్టెంట్) భార్య లెఫ్టినెంట్ రేఖా సింగ్, చెన్నైలో శిక్షణ పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో చేరారని ఆర్మీ ట్వీట్ చేసింది. గల్వాన్ ఘర్షణల సమయంలో దీపక్ సింగ్ అత్యున్నత త్యాగం చేశారని పేర్కొంది.