NTV Telugu Site icon

“Dog” Remark: ‘‘నిరాశ నుంచి నిరుత్సాహానికి’’.. కాంగ్రెస్ చీఫ్ ‘‘కుక్క’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

Maharashtra Congress

Maharashtra Congress

“Dog” Remark: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే బీజేపీ నేతల్ని ఉద్దేశిస్తూ చేసిన ‘‘కుక్క’’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ ‘‘నిరాశ’’ చెందుతోందని అభివర్ణించింది. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి తీవ్ర నిరుత్సాహంతో ఉందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య అన్నారు.

‘‘వారు నిరాశ నుంచి నిరుత్సాహనికి’’ వెళ్తున్నారు. శరద్ పవార్ ఏదో మాట్లాడుతున్నాడు, ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల సంఘాన్ని తిడుతున్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ బీజేపీని కుక్క అని పిలుస్తోంది, ఎందుకంటే అన్ని సర్వేలు కూడా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారం చేపడుతుందని చెబుతున్నాయి, దీంతో వారంతా నిరాశలో ఉన్నారు, దీనిని మేము అర్థం చేసుకోగలమని సోమయ్య ఎద్దేవా చేశారు.

Read Also: CM Chandrababu: వాళ్లకు బాధ్యత లేదు.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం

సోమవారం అకోలాలో జరిగిన కాంగ్రెస్ ప్రచారంలో నానా పటోలే మాట్లాడుతూ.. ‘‘ మిమ్మల్ని కుక్కలని పిలిచే బీజేపీ వాళ్లకు అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా..? ఇప్పుడు బీజేపీని కుక్కగా మార్చే సమయం వచ్చింది. వారు చాలా అహంకారంతో ఉన్నారు’’అని బీజేపీని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అంతే ధీటుగా స్పందిస్తోంది.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. నానా పటోలే నిరుత్సాహానికి గురయ్యారని, ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోదని స్పష్టమైందని, అందుకే వారు నిరాశలో ఉన్నారని, అందుకు బీజేపీని కుక్కులు అంటూ తిడుతున్నారని, ఇది ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ మైండ్ సెట్‌ని తెలియజేస్తోందని దుయ్యబట్టారు. నానా పటోలే వాడిన పదాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్, కుమారస్వామిని ఉద్దేశిస్తూ ‘‘నలుపు’’ అనే పదాన్ని వాడాడని, ఇప్పుడు పటోలే కుక్క అనే పదాన్ని వాడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి మండిపడ్డారు.

Show comments