NTV Telugu Site icon

AAP: ఉచితాలను కొనసాగిస్తూనే, మరో 8-10 హమీలు.. ఢిల్లీలో ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీలు’’

Aap

Aap

AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇక కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేక హామీలను సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు.

ఓటర్లను ఆకర్షించడానికి ఆప్ ఉచితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆప్ మేనిఫెస్టోలో 8-10 ఎన్నికల వాగ్దాలు ఉంటాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. మహిళలకు ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య, తీర్థ యాత్ర, బస్సు ప్రయాణాలతో పాటు, ఆప్ మ్యానిఫెస్టో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ ‘‘మోడీ కి గ్యారెంటీ’’ నినాదంలో ముందుకు వెళ్లింది, ఈ సారి ఆప్ కూడా ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీ’’ పేరుతో ఎన్నికల బరిలోకి వెళ్తోంది.

Read Also: Puri Shankaracharya: హిందువుల్ని రక్షించండి లేదా తీవ్ర పరిణామాలు ఉంటాయి..

ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం దక్కించుకునేందుకు ఆప్ మహిళా సమ్మన్ యోజన, సంజీవని యోజన అనే పేరుతో రెండు ప్రధాన పథకాలను తీసుకురాబోతున్నట్లు చెప్పింది. ఈ సారి ఎన్నికల్లో తాము గెలిస్తే మహిళా ఓటర్లకు (ఆదాయపు పన్ను చెల్లించనివారికి) నెలవారీ భరణాన్ని రూ. 1000 నుంచి రూ.2100కి పెంచుతామని హామీ ఇచ్చింది. ‘సంజీవని యోజన’ కింద, 60 ఏళ్లు పైబడిన నివాసితులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. పూజారి గ్రంథి సమ్మాన్ యోజన కింద నెలకు రూ.18,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా పూజారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది.

ఆటోరిక్షా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ భద్రతా పథకానికి హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ రూ.15 లక్షల విలువైన జీవిత, ప్రమాద బీమా, వారి కుమార్తెల వివాహాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, సంవత్సరానికి రెండుసార్లు రూ.2,500 యూనిఫాం అలవెన్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. నీటి బిల్లుల మాఫీ, స్వచ్ఛమైన తాగునీరు, ప్రధాన మౌళిక సదుపాయాలను మేనిఫెస్టోలో భాగం చేసే అవకాశం ఉంది.

Show comments