ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని ఎంత హెచ్చరిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. చెన్నైలోని కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. అయితే మోహన్ కు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడడం అలవాటుగా మారింది. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ..అందులో డబ్బులు పెట్టేవాడు. తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో ఇతరుల దగ్గర అప్పు చేసేవాడు. ఇలా లక్షలాది రూపాయలు అప్పులు చేసి..మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.