Site icon NTV Telugu

Mukul Roy: మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత

Mukulroy

Mukulroy

తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వేమంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. టీఎంసీ, బీజేపీ పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ తెల్లవారుజామున 1:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే గత కొన్ని నెలలుగా మూత్ర పిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులతో పోరాడుతున్నారు.

మకుల్ రాయ్ ప్రస్థానం..
బెంగాల్ రాజకీయాల్లో మకుల్ రాయ్ చాణక్యుడిగా ప్రసిద్ధ చెందారు. మమతకు కుడి భుజంగా ఉండేవారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ప్రసిద్ధి చెందారు. యూపీఏ రెండు హయాల్లో షిప్పింగ్, రైల్వే మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఇలా బెంగాల్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా పేరు గాంచారు.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో ఘోరం.. నదిలో పడ్డ బస్సు.. 18 మంది మృతి

యూపీఏ రెండో హయాంలో మొదట షిప్పింగ్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఉన్నారు. అనంతరం రైల్వే మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా కూడా పని చేశారు. అనంతరం ఆయన రాజకీయ జీవితం గందరగోళంగా మారింది. 2017లో అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చేరారు. 2021లో అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారి సంచలనం సృష్టించారు. కృష్ణనగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున గెలిచారు. అంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ యూటర్న్ తీసుకుని.. ఎన్నికలు ముగియగానే తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.

ఇది కూడా చదవండి: US-Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు తరలివెళ్తున్న అమెరికా బలగాలు

Exit mobile version