Site icon NTV Telugu

Kedar Jadhav: బీజేపీ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ ‘‘కేదార్ జాదవ్’’..

Kedar Jadhav

Kedar Jadhav

Kedar Jadhav: భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది క్రికెట్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన జాదవ్, ఇప్పుడు రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టారు. 40 ఏళ్ల కేదార్ జాదవ్ మంగళవారం ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పెద్దల సమక్షంలో అధికారికంగా చేరారు. మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే ఆయనను పార్టీలోకి స్వాగతించారు.

Read Also: CMF Phone 2: మరోమారు అద్భుత ఆవిష్కరణకు సిద్దమైన CMF.. కొత్త ఫోన్ లాంచ్కు డేట్ లాక్

మహారాష్ట్ర పూణేలో 1985 మార్చి 26న జన్మించిన కేదార్ జాదవ్ 2014లో శ్రీలంకపై భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉన్న జాదవ్ మొత్తం 73 వన్డేల్లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించారు. 42.09 సగటుతో 1,389 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్నర్‌గా వన్డేల్లో 5.15 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టాడు. జాదవ్ దేశీయ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు.

2017లో పూణేలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కేవలం 76 బంతుల్లోనే 120 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జాదవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో 12వ ఓవర్‌లో విరాట్ కోహ్లీతో కలిసి చారిత్రాత్మక 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరుపున ఆడాడు. 2024లో రిటైర్మెంట్ ప్రకటించి, 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పారు.

Exit mobile version