Ex CM Daughter: పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex CM Daughter: ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూమార్తె. ఆమె ప్రస్తుతం లింగమార్పిడి చేసుకోవాలని భావిస్తోంది. తను మహిళగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పురుషుడిలాగనే జీవించింది. అయితే ఇపుడు శారీరకంగా కూడా పురుషుడిగా మారాలని కోరుకుంటోంది. అందుకే 41 ఏళ్ల వయస్సులో ఆమె లింగ మార్పిడి చేసుకొని స్త్రీ నుంచి పురుషుడిగా మారడం కోసం లింగమార్పిడి చేసుకోనున్నట్టు ప్రకటించారు. ఇది తన సొంత నిర్ణయమని.. దీనిపై ఎవరు రాద్ధాంతం చేయవద్దని స్పష్టం చేశారు. ఆమెనే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య.
Read also: Ashada Bonalu 2023: నేటినుంచే ఆషాడ బోనాలు షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. తాను పుట్టుకతో మహిళనే అయినప్పటికీ.. చిన్నప్పటి నుంచి మానసికంగా పురుషుడి లాగానే జీవిస్తోంది. మానసికంగానే కాకుండా శారీరకంగానూ పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. ఇటీవల నిర్వహించిన ఎల్‌జీబీటీక్యూ వర్క్‌షాప్‌నకు హాజరయ్యారు. పుట్టినప్పటి నుంచి తాను పురుషుడిగా భావిస్తూ.. పురుషుడిగానే జీవిస్తున్న ఆమెకు అదే నమ్మకం మరింత బలపడింది. దీంతో 41 ఏళ్ల వయసులో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై న్యాయ నిపుణులు, వైద్యులు, ఇతర నిపుణుల సలహాలు తీసుకున్న ఆమె.. అందుకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.
Read also: CM KCR: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం.. నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
లింగమార్పిడి వల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా పురుషుడిలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తాను పురుషుడిగా మారిన తర్వాత తన పేరును సుచేతన భట్టాచార్య నుంచి.. సుచేతన్‌గా మార్చుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సంబంధిత న్యాయ, వైద్య సలహాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాల లాగానే మహిళ నుంచి పురుషుడిగా మారాలనే నిర్ణయాన్ని తానే స్వయంగా తీసుకున్నట్లు సుచేతన భట్టాచార్య తెలిపారు. ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంలో భాగంగానే పురుషుడిగా మారుతున్నట్లు ఆమె వెల్లడించారు. అదే సమయంలో ప్రతిరోజూ ట్రాన్స్ మ్యాన్‌గా తాను ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను తట్టుకునేందుకు లింగ మార్పిడి ఆపరేషన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే తాను మానసికంగా పురుషుడినని భావిస్తున్నానని.. ఈ లింగ మార్పిడి ఆపరేషన్ పూర్తి అయితే శారీరకంగా కూడా పురుషుడి లాగే ఉంటానని స్పష్టం చేశారు
Read also: Anchor Lasya : వంటలక్కగా మారిన లాస్య.. కట్టెల పొయ్యి పై కష్టపడుతూ…
తాను తన ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నానని సుచేతన భట్టాచార్య స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎవరూ వివాదం కానీ.. రాద్దాంతం కానీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఈ వివాదంలోకి తన తల్లిదండ్రులను లాగవద్దని మీడియాకు సూచించారు. చిన్నతనం నుంచి తన గురించి పూర్తిగా తెలిసిన తండ్రి తన నిర్ణయానికి మద్దతు ఇస్తారని భావిస్తున్నట్లు సుచేతన మీడియాకు తెలిపారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!