Site icon NTV Telugu

JPC First Meeting: నేడు ఒకే దేశం- ఒకే ఎన్నికపై జేపీసీ మొదటి సమావేశం..

Jpc

Jpc

JPC First Meeting: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం ఈరోజు (జనవరి 8) జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను జేపీసీ సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు వివరించనున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాక పలువురి అభిప్రాయాలను కూడా జేపీసీ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే, జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్‌లో మొదటి వారం చివరి రోజున లోక్‌సభలో సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే దీనిపై సుధీర్ఘ చర్చ చేపట్టేందుకు కమిటీ సభ్యులు చర్యలు వేగవంతం చేసినట్టు సమాచారం.

Read Also: ISRO New Chief: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వి.నారాయణన్‌..

కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశ్ పెట్టారు. ఈ తీర్మానికి లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. అయితే, ప్రతిపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ బిల్లుపై మరింత కసరత్తు చేయడానికి కేంద్ర సర్కార్ జేపీసీకి ఈ బిల్లును పంపించింది. 39 మంది సభ్యులతో కూడిన కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ను నుంచి ప్రియాంక గాంధీ, జేడీయూ- సంజయ్ ఝా, శివసేన (షిండే)కు చెందిన శ్రీకాంత్ షిండే, తృణమూల్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ, ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌తో పాటు తదితరులు సభ్యులుగా ఇందులో ఉన్నారు.

Exit mobile version